Monday, January 8, 2024

శివోహం

శివ నువ్వు కానిది ఏది?...
నువ్వు లేనిది ఏది?...
సర్వాంతర్యామి నువ్వు!...
సర్వం సృష్టించినవాడవు!...
కడు కష్ట మయినా,కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే...
నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను...
సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను.
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!ఏ కంటికి లోచూపు ఎఱుక అయ్యేనో
ఆ కంటికి ఈ చూపు నెరిగించు ఒక్కసారి
గుర్తె‌రిగి వుంటాను గమ్యాన్ని యెపుడూ
మహేశా . . . . . శరణు .

Sunday, January 7, 2024

శివోహం

శివా!ఆధ్యంత రహిత అభిషేక ప్రియ
జ్యోతిగా వెలిగేవు  ఖ్యాతిని మెరిసేవు
అనిపించ రావయ్య ఆ ఖ్యాతిని
మహేశా . . . . . శరణు .

శివోహం

నిన్నటిరోజు నీ ఆఙ్ఞతోనే గడిచింధి...
నేడు కూడా నీ అనుఙ్నతోనే నడుస్తుంధి...
రేపటిరోజు నీ ఆధీనంలోనే ఉంది...
ఋతువులు మారిన , గడియలు గడిచినా, మీ స్మరణను విడువని సంకల్పాన్ని స్థిరము చేయు భాద్యత నిదే...
మహాదేవా శంభో శరణు...

శివోహం

హృదయం తడిచినప్పుడే అనుకున్నా శివ...
ప్రేమ కురిపించింది నువ్వేనని..

శివ నీ దయ.

Saturday, January 6, 2024

శివోహం

శివ...
పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే కదా అని సదా నీ నామ స్మరణలో.

శివ నీ దయ.

జై శ్రీరామ్

రామ నామం చేయండి
ఆస్వాదించండి
ఆస్వాదించి ఆనందించండి
ఆనందించి తరించండి

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...