Tuesday, January 9, 2024

శివోహం

శివ
నీ నామ స్మరణమే నామనసుకు తెలిసినది...
భౌతికంగా దేహం నిదురపోయినా, మానసికంగా నిన్నే తలచును నామది...
హృదయం నిండా నిండిపోయావు...
ఊపిరి ఉన్నా ఊడిపోయినా నేనూగేది నీ ఒడి ఊయలలోనే పరమేశ్వరా...
నీ సన్నిధిని జననం మరణం భావనలుండవు ఈశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
అమ్మ కడుపులో నీతో మాట్లాడిన మాటలే..
నా చెవిలో మంత్రాలిప్పుడు.
శివ నీ దయ.

శివోహం

శివా!నీ చిక్కుల్లో చిక్కుకున్న మందాకిని
నీ దేహ స్పర్శతో గంగగా ఘనత నొందె
నీ పదము తాకి  నన్నూ ఘనతనొందనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రేమ భగవంతుడిని మన హృదయంలో బంధించడానికి తోడ్పడే అత్యంత సున్నితమైన, మధురమైన ఆయుధం!

ధ్యానం, మంత్రం, తంత్రం ఏమీ  తెలియక పోయినా పరవాలేదు...
నిష్కల్మషంగా ప్రేమించే హృదయం నీ దగ్గర ఉందా? భగవంతుడు ఈ రోజునే ఇప్పుడే ఈ క్షణమే నీ వశమవుతాడు.

ఓం నమః శివాయ.
ఓం పరమాత్మనే నమః.

Monday, January 8, 2024

శివోహం

శివ నువ్వు మయాలోడివి సుమ నువ్వు ఆడించే గారడి ఆటలో పడి నేను తప్పిపోయి చానాళ్ళయింది...

శివ నీ దయ.

శివోహం

శివ నువ్వు కానిది ఏది?...
నువ్వు లేనిది ఏది?...
సర్వాంతర్యామి నువ్వు!...
సర్వం సృష్టించినవాడవు!...
కడు కష్ట మయినా,కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే...
నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను...
సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను.
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!ఏ కంటికి లోచూపు ఎఱుక అయ్యేనో
ఆ కంటికి ఈ చూపు నెరిగించు ఒక్కసారి
గుర్తె‌రిగి వుంటాను గమ్యాన్ని యెపుడూ
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...