Tuesday, January 16, 2024

శివోహం

అహం పెరిగితే రాగద్వేషాలు 
అహం తరిగితే ప్రేమానందాలు 
అహం ఆకాశమైతే ద్వైతం 
అహం నశించితే అద్వైతం 
ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, January 15, 2024

శివోహం

శివ
ఈ వేదిక నీదే...
రచన దర్శకత్వం అన్నీ నీవే..ఎం
"నేను" ప్రేక్షకుడను మాత్రమే.. 
పాత్రలన్నీ నీవే...
నిత్యం నీ భిన్నరూప దర్శనమే మాకు మహద్భాగ్యం...
నీతో ఉంటే నీలీలలన్నీ చూసే భాగ్యం కలుగుతుంది ఏమో.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అంతరంగమున అనువుగా వుండి
కొలతకందకున్న కొలవై వుండి
వేయినామాల మాకు వేలుపైనావు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఏకాకితనాన్ని భరించలేను శివ...
నిత్యం నీ ఓంకారం వినబడాల్సిందే.

మహాదేవా శంభో శరణు

Sunday, January 14, 2024

శివోహం

శివ...
నాకు రాదు ఏ చమకం నాకున్నదల్ల నీపై నమ్మకం...
తీయలేను ఏ రాగం చేయలేదు ఏ యజ్ఞం 
పాడాను లింగాష్టకం...
ఈశ్వరం పరమేశ్వరం వందేహం సర్వ పాప హరం...
ఆష్ట దరిద్ర వినాశనం సిద్ధం ఇష్ట ఐశ్వర్య ప్రాప్తం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, January 13, 2024

శివోహం

తండ్రీ కొడుకుల అనుబంధం
ఒక జన్మది కాదు.
ఒక జన్మతో తీరిపోదు.
అది జన్మజన్మల అనుబంధం.

శివ నీ దయ.

శివోహం

శివా!నీ దరిదాపున కూర్చున్నాడు
నిను మోపున  మోస్తున్నాడు
నంది భాగ్యం నాకూ కొంత అందనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...