Wednesday, January 17, 2024

శివోహం

మొదటి ఒడి చేసుకున్న ఋణం...
రెండవ ఒడి తీర్చుకున్న ఋణం...

రెండు ఋణాల జమాఖర్చుల మధ్య నను నడిపే నాధుడు  నీవే తండ్రి

మహాదేవా శంభో శరణు.

Tuesday, January 16, 2024

శివోహం

కదిలే ప్రతిది నీ కదలిక...
కదలని ప్రతిది నీ ప్రీతి కలిగినదే.

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

శివ, నిన్ను భక్తి తో తలుస్తున్నాని అంటున్నారు అందరు...
నాకుంది నీ పిచ్చి వ్యసనమని తెలియక.

శివ నీ దయ.

శివోహం

అహం పెరిగితే రాగద్వేషాలు 
అహం తరిగితే ప్రేమానందాలు 
అహం ఆకాశమైతే ద్వైతం 
అహం నశించితే అద్వైతం 
ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, January 15, 2024

శివోహం

శివ
ఈ వేదిక నీదే...
రచన దర్శకత్వం అన్నీ నీవే..ఎం
"నేను" ప్రేక్షకుడను మాత్రమే.. 
పాత్రలన్నీ నీవే...
నిత్యం నీ భిన్నరూప దర్శనమే మాకు మహద్భాగ్యం...
నీతో ఉంటే నీలీలలన్నీ చూసే భాగ్యం కలుగుతుంది ఏమో.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అంతరంగమున అనువుగా వుండి
కొలతకందకున్న కొలవై వుండి
వేయినామాల మాకు వేలుపైనావు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఏకాకితనాన్ని భరించలేను శివ...
నిత్యం నీ ఓంకారం వినబడాల్సిందే.

మహాదేవా శంభో శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...