Tuesday, February 6, 2024

శివోహం

అర్ధ నారీశ్వర తత్వం,లోకానికి ఓక సందేశం.
తన దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానము ఏ బేదం లేదు.

ఓం అర్ధనారీశ్వరాయ నమః 

Monday, February 5, 2024

శివోహం

అంబరమూ అనంతమైనదే
సంద్రమూ అంతుచిక్కనిదే
ఏ ఆడంబరమూ అక్కర్లేదు ఆత్మసౌందర్యముంటే.

ఓం నమో వెంకటేశయా.

శివోహం

మాటలు రాని మనసు బాధను చిరునవ్వు అనే ముసుగు తో కప్పి ఉబికి వస్తున్న కన్నీటిని కళ్ళలో దాచుకొని బయటి ప్రపంచానికి ఎదో చూపాలన్న తాపత్రయం నా అక్షరాలకి.


        శివ నీ దయ.

శివోహం

శివా!పగవాడు  కాదని
సిగలోన చోటుచ్చి
శోభింప జేసావు సోముని
మహేశా . . . . . శరణు .

శివోహం

కాసేపు ఏదో తెలియని సంతోషం మంచు ముక్కలాగా .
అంతే త్వరగా ఏదో తెలియని బాధ రాతి బండ లాగా.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా
అమ్మ దుర్గమ్మ నీవే శరణు.

శివోహం

కాలు కదిపితే ఆటట..
నీ కన్ను తెరిస్తే మంటట...
నీ నాటకాన మేమంతా నటులమట...
ఒట్టు వట్టి చీమలమట...
ఈ ఆటయ్యాక చేరేది నీ గూటికేనట కదా...
అక్కున చేర్చుకో ప్రాణేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

Sunday, February 4, 2024

శివోహం

శివా!భ్రమలలో నేనున్నాను
ప్రభలతో నీవున్నావు
నీ ప్రభలు తాకి నా భ్రమలు తొలగనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...