Thursday, February 8, 2024

శివోహం

శివా!అల్పమైన  దూరానికి
అనంతమైన ఈ ప్రయాణం
అవక తవకలనుండె ఆదుకొనుమా
మహేశా . . . . . శరణు .

శివోహం

కోరికల ఇటుకలు కాలి
బ్రతుకు పోరాటముల మట్టితో
గూడు కట్టుకుంట,...
కాసింత జాగా ఈయవా శివ కైలాసంలో...
తొలి అడుగు నీవే...
అమ్మనువ్వు గృహప్రవేశం చేసిపెట్టాలి

మహాదేవా శంభో శరణు 

Wednesday, February 7, 2024

శివోహం

కొన్ని క్షణాలు నాలో నిన్ను చూడాలనే ఏకాంతంలోకి వెళ్తూ ఉంటా.

శివ నీ దయ.

శివోహం

శివా!సుందరమైన నీ రూపమున
కంఠము నందు కాలము ఏల
పంతము వీడు పరమేశా
మహేశా . . . . . శరణు .

శివోహం

అవును నేను శివుడు క్లాస్ మెట్...
నా ఆత్మీయ మిత్రుడు.
కాదు నేనె శివుణ్ణి...
కాలకూటవిషాన్నే కంఠ ధరించి అతను..
కర్మ బంధాలతో అనుబంధతో నేను...
వేదాలతో అతను...
బాధలతో నేను...
లోక రక్షణ కోసం అతను...
కుటుంబ రక్షణ కోసం నేను..
అవును నేను శివుడిని.
మహాదేవా శుభో శరణు...

శివోహం

రుద్రాయ
రుద్రనేత్రాయ...
కాలాయ
కాలసంభవాయ...
త్రిగుణాయ
త్రినేత్రభూషితాయ...
అనంతాయ
అనంతరూపాయ...
ఆద్యాయ
అద్యదేవాయ...
లింగాయ
లింగస్వరూపాయ...
నటరాజాయ
నాట్యకుషాగ్రాయ.
శివాయ
నమః శివాయ...

ఓం శివోహం...సర్వం శివమయం

Tuesday, February 6, 2024

శివోహం

పసి పిల్లాడికి రెండే తెలుసు ఏడవడం, నవ్వడం ఎందుకో కారణం వాడికి తెలియదు ప్రస్తుతం నా స్థితి లాగ.

శివ నీ దయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...