Friday, February 9, 2024

శివోహం

నీతో వేగలేనమ్మా ఓ మనసా..
ఎందుకొచ్చిన తంటా మనము వేరుబడదాము నా మనసా...
కూడి ఆరు శత్రువులతో క్రీడించు చుంటావు...
మూడు లోకములందుండే మురికితో నిండావు...
మూఢముగా బహుకర్మలలో మునుగుచు వుంటావు...
అందుకే నీతో వేగలేనమ్మా ఓ మనసా..

గోవిందా

గోవిందా 
కలి మాయలో ఉన్న మాకు...
కలిలో నీవే కనిపించు దైవము నీవు...
పిలిస్తే పలికే దేవదేవుడవు నీవు...
కలి మాయ నుండి రక్షించే భారం నీదే కదా 
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకటనాయకా

Thursday, February 8, 2024

శివోహం

శివా!అల్పమైన  దూరానికి
అనంతమైన ఈ ప్రయాణం
అవక తవకలనుండె ఆదుకొనుమా
మహేశా . . . . . శరణు .

శివోహం

కోరికల ఇటుకలు కాలి
బ్రతుకు పోరాటముల మట్టితో
గూడు కట్టుకుంట,...
కాసింత జాగా ఈయవా శివ కైలాసంలో...
తొలి అడుగు నీవే...
అమ్మనువ్వు గృహప్రవేశం చేసిపెట్టాలి

మహాదేవా శంభో శరణు 

Wednesday, February 7, 2024

శివోహం

కొన్ని క్షణాలు నాలో నిన్ను చూడాలనే ఏకాంతంలోకి వెళ్తూ ఉంటా.

శివ నీ దయ.

శివోహం

శివా!సుందరమైన నీ రూపమున
కంఠము నందు కాలము ఏల
పంతము వీడు పరమేశా
మహేశా . . . . . శరణు .

శివోహం

అవును నేను శివుడు క్లాస్ మెట్...
నా ఆత్మీయ మిత్రుడు.
కాదు నేనె శివుణ్ణి...
కాలకూటవిషాన్నే కంఠ ధరించి అతను..
కర్మ బంధాలతో అనుబంధతో నేను...
వేదాలతో అతను...
బాధలతో నేను...
లోక రక్షణ కోసం అతను...
కుటుంబ రక్షణ కోసం నేను..
అవును నేను శివుడిని.
మహాదేవా శుభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...