Saturday, February 10, 2024

శివోహం

మక్కువగా చేరగలిగే మజిలీ కోసం నీ పిలుపొక్కటే మిగిలి ఉంది తండ్రి.

మహాదేవా శంభో శరణు.

శివోహం

అమ్మ తో ఉన్న పసితనాన్ని ఆస్వాదించలేదు...
నీ భక్తి లో నేనింకా పసితనం లోనే ఉన్నా.

శివ నీ దయ.

శివోహం

పరమాత్మ...
పరంధామా...
పరమేశ్వర...
పావనా శుభ పరంబ్రహ్మా...
వరదాయక...
కృష్ణా కావర నిన్నే నమ్మితి...
హరి వసుదేవ సుతా శరణు.

శివోహం

శివ నామస్మరణ సులభోపాయం...
ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం ...
మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున శివ నామ స్మరణే నిత్యము సత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తూ ఏది చేసినా, అది భగవత్ సేవగా భావిస్తూ నిద్రకు ఉపక్రమించినప్పుడు భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తూ ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉందాము.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 9, 2024

శివోహం

శివా!సాధన చేస్తూ
శోధన చేస్తున్నా
నా వేదన వివర్జితమవనీ
మహేశా ..... శరణు.

శివోహం

*సప్త సాగరాలు దాటి*

 కనుమరుగైనా ఆపాతమధురాలు(జ్ఞాపకాలు) తిరిగి వచ్చేనా

శివోహం

జీవితమనే పుస్తకంలో కొన్ని పేజీలను నా (నీ) కోసం నింపుకుంటూ కాలం అలా కదులుతుంది.

శివ నీ దయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...