Sunday, February 11, 2024

శివోహం

నా మనసు స్వేచ్చాపశువు గా తిరుగుతోంది...
దానికి నీ లీలల పాశంతో కట్టివుంచు...
నీ నామ సంకీర్తన అనే మేత వేసి...
ప్రతిరోజూ నా జన్మ సార్థకం తెలియచేయు..
ఈ కట్టెకు యజమాని నీవే అనే స్మరణ తెలిసేలా..

శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

ప్రేమ

ఈరోజు ఏం పూసుకొచ్చిందో చల్లని చిరుగాలి నీ పరిమళాన్ని నాపై వెదజల్లుతోంది..

నిజంగా పునర్జన్మించాలనుంది సఖి
నాపై నీ ప్రేమ పరిమళమై గమ్మత్తుగా తోస్తుంటే.

శివోహం

శివా!నే సూటిగ నిను చూడంగ
ఏటికి నేనేమవ్వాలి
రేపటికి మరి తెలియాలి
మహేశా . . . . . శరణు .

శివోహం

ఇష్టమంటే ఇదేనేమో శివ...
నీ ధ్యాస నుండి క్షణం కూడా దూరం జరగదు నా మనసు.
ఈ జన్మకింకేం కావాలి తండ్రి.
నా భక్తి ఆకలి కోసమే మరో జన్మెత్తానెమో...

శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

Saturday, February 10, 2024

శివోహం

శివా!దిక్కు నీవేనని నమ్మిన నాకు
దిక్కులతో యిక పనియేమి
నీ ధృక్కు దక్కిన చాలు
మహేశా . . . . . శరణు .

శివోహం

మక్కువగా చేరగలిగే మజిలీ కోసం నీ పిలుపొక్కటే మిగిలి ఉంది తండ్రి.

మహాదేవా శంభో శరణు.

శివోహం

అమ్మ తో ఉన్న పసితనాన్ని ఆస్వాదించలేదు...
నీ భక్తి లో నేనింకా పసితనం లోనే ఉన్నా.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...