Tuesday, February 13, 2024

శివోహం

ప్రపంచానికి కనపడే నేను కనపడని నా మనసుతో నిరంతరం ఆరాటంతో కూడిన పోరాటం చేస్తున్న ఏమిటో ఈ చిత్రం నిజంగా విచిత్రం గా ఇదే సత్యం.

ఓం నమః శివాయ

శివోహం

శివా!మా ముందు వెనుకల
నీవె మసలుచుండిన గాని
మాయందు ఆ ఎఱుక కరువాయెను
మహేశా . . . . . శరణు.

శివోహం

శివ...
మా తత్వము నెరుగు శక్తి  లేని వారము...
నీ తత్వము ఎట్లా తెలుసుకోగలమయ్యా.
ప్రాణేశ్వరా తెరిపించ వయ్యా మా మనోనేత్రం...
మరిపించ వయ్యా మా మూర్ఖత్వం.
మహాదేవా శంభో శరణు

Monday, February 12, 2024

శివోహం

శంభో శంఖారా శివ శంభో శంకరా
అనంత జీవ ముఖ బహు విధ రూపేశ్వరా 
విశ్వ శరీరాకృత ఓంకార నాద అర్ధనారీశ్వరా
అద్వైత్వ అపూర్వ అఖిలేశ్వరా
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ! నా తలపుల నిండా నువ్వున్నందుకేమెా 
ప్రతి పదమూ నీ ఆరాధనలో అక్షరార్చనలోనే తరిస్తోంది

శివ నీ దయ.

శివోహం

నేను కట్టుబాట్లకు కట్టుబడి...
కట్టబడి...
కట్టెగా ఉన్నాను శివ...
చివరికి నా చితి కట్టెల మీద కడ చేరేలోపు...
కడసారైన నిను భౌతికంగా చూడగలని ఒకే ఒక కోరిక.

శివ నీ దయ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

నేను కట్టుబాట్లకు కట్టుబడి...
కట్టబడి...
కట్టెగా ఉన్నాను శివ...
చివరికి నా చితి కట్టెల మీద కడ చేరేలోపు...
కడసారైన నిను భౌతికంగా చూడగలని ఒకే ఒక కోరిక.

శివ నీ దయ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...