Monday, February 26, 2024

శివోహం

ఒక శూన్యం నుండి మరొక శూన్యంలోకి పయనిస్తూన్నా నా జీవిత పుస్తకం జవాబుల్లేని బ్రతుకులో అన్నీ ప్రశ్నాపత్రాలే.

శివ నీ దయ.

శివోహం

శివా!ప్రశ్నగా నేను
ప్రత్యుత్తరముగా నీవు
నా పశ్న పరి ప్రశ్నగా విరియనీ
మహేశా ..... శరణుణ

శివోహం

శివ...
నీవు ఏ కన్ను తెరచినా
నేనుండేది నీ కనుసన్నలలోనే...
నీ మౌనం నాకు దీవెనగా భావించి జీవన యానం
సాగిస్తున్నాను...
నామేను వీడి నేను నీకడకు చేరాలనినా నా యజమానివి నీవే...
ఇంకో జన్మకు ఈ దేహం ను ఇంకో శరీరం కి బాడుగకు పంపించకుండా నీగణంలో ఒకడిని చేసుకొని నీ వాడిగా మలచుకో.

శివ నీ దయ
మహాదేవా శంభో శరణు.

Sunday, February 25, 2024

శివోహం

ఎన్నో ఆలోచనలు, ఆశల కలబోత మనసు...
మనసు కి  కావలసినది దొరికే వరకు అలుపు లేకుండా నిరంతరం పరితపిస్తూ నే ఉంటుంది...
శరీరానికి నటించడం తెలుసేమో గాని , మనసు కు మాత్రం తెలియదు...
ఎందుకంటే మనసు ఒకవేళ పోరపాటున నటించినా క్షోభ అనుభవిస్తూనే ఉంటుంది...
ఔనన్నా కాదన్నా ఆ విషయం మనసు కు స్పష్టంగా తెలుసు...
మనసు సంతోషం, సంత్రృప్తి పడింది అంటే చాలు ఇక అదే మనిషికి జీవిత పరమార్థం. 

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!పుర్రెలన్ని తెచ్చి పూస గుచ్చి
మెడను వేసుకుంటివి మర్మమేమి
పేరు తెలియగ మాకు పంచవయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎప్పుడు వచ్చి వాలాయో ఇన్ని వేల భావాలు నా గుండె గూటిలోకి...
ఏ శుభ ముహూర్తనా చేయి పట్టి ఓనమాలు నేర్పించావో మరి.

శివ నీ దయ.

శివోహం

కాళేశ్వర
ముక్తీశ్వర
శ్రీరామలింగేశ్వరా
నగరేశ్వర
సోమేశ్వర
భీమేశ్వర
శ్రీరాజరాజేశ్వరా
బాలేశ్వర
భువనేశ్వర
సోమసుందరేశ్వరా
ఈశ్వరా
మహేశ్వరా
శ్రీకాళహస్తీశ్వరా
శంభో శంకరా
పురహరా
ఓంకారేశ్వరా
నమఃశివాయ
నమఃశివాయ
నమఃశివాయ
హరహర మహాదేవా శంభో శంకరా.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...