Wednesday, February 28, 2024

శివోహం

నీ మౌనం మాటాడుతుంది నాకు వినబడుతుంది...
అనంతమైన నా ద:ఖాన్ని చెరిపివేస్తుంది.

శివ నీ దయ

శివోహం

దారి తప్పిన నా మనస్సు తెలిసి తెలియక చేసిన పాపాలు ఎన్నో...
గాడి తప్పిన మతిని అనుసరించి మనిషిగా చేసిన నేరాలు ఎన్నో...
అన్ని దోషాల మూటలే...
మోయలేని ఈ భారాలను నా తల ఎంత కాలం మోస్తుంది...
భారాలను బాధలను దించి హరించే వాడివి నీవు
నా బ్రతుకులు మార్చే వాడివి నీవు.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అంతటా వున్నవాణ్ణి అర్చిస్తున్నాను
శుభములొసగే వాన్ని స్తుతిస్తున్నాను
నా మతిని నీ గతికి నడిపించవయ్యా
మహేశా . . . . . శరణు .

Tuesday, February 27, 2024

శివోహం

జీవుడే శివుడు...
సమస్త భూతముల యందు శివుడే వ్యవస్థితుడై యున్నాడు అని ఈ విధముగా ఎవడు సత్యమును గాంచుచున్నాడో వాడే జీవన్ముక్తుడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు...
దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ,ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి. 

ఓం గం గణపతియే నమః.
ఓం పరమాత్మనే నమః

శివోహం

ఆశలతో  అందలం ఎక్కించి...
ఆనందంలోనే  అన్నీ ఆవిరి చేసేసి
కర్మ లంటు ఆడుకోకు తండ్రి...
ఉద్దరించుట నన్ను...
తండ్రీ గా నీ ధర్మము కదా.
మహాదేవా శంభో శరణు.

Monday, February 26, 2024

శివోహం

శివా...
నీవు వినక, కానక... 
ఏమిగాను నా గతి... 
నుదిటి రాతలను మార్చేదెవ్వరు..
మనసు వ్యధలని తీర్చేదెవరు...
పరమేశ్వరా నీవే దిక్కు శరణు శరణు.
మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...