Friday, March 1, 2024

శివోహం

మౌనంగా కనులు మూసుకొని
మనసులో నీ రూపు నిలుపుకొని
ఆర్ధతా భావంతో, పలకరించే వేళ
కనులు తడిబారినా అదుపుచేసుకోగలను...
కానీ గుండె గదుల్లో నీవు కనిపించి మాయమైతే తట్టుకోలేను..
నా ఆవేదన దక్షిణ నీవు తీసుకుని నాలో ఉండమని కోరుకుంటున్నాను...
మహాదేవా శంభో శరణు.

Thursday, February 29, 2024

శివోహం

తెల్లవారుజామున లేచి పాదాలు నేలని తాకగానే హమ్మయ్య *ఇంకా భూమి మీదే ఉన్నాను అనే ఆనందం* అంత ఈశ్వరుడి కృప.

శివ నీ దయ.

కన్నయ్య ప్రేమ

కన్నయ్య....👣
నీ కన్నుల్లోకి చూసిన ప్రతిసారీ..
నీ భావాలతో పండుగే నా మనసుకి.
❤️ You నాని బెట.

శివోహం

శివా!మా కోరిక, చేరిక నీవే
మేము నీ సరివా‌రముగా 
నీ పరివారమున చేరనిమ్ము
మహేశా . . . . . శరణు .

శివోహం

ఆశలతో అందలమెక్కిస్తావు...
ఆనందంలోనే  అన్నీ ఆవిరి  చేసెస్తావు...
బంధాలతో బంధీలను చేసి...
కొందరిని బలవంతులుగా...
మరికొందరిని బలహీనులుగా మారుస్తావవు...
నీవు ఆడే ఈ ఆటలో తొలుబొమ్మలం...
శివ నీ దయ
మహాదేవా శంభో శరణు.

శివోహం

కాలాన్ని వేడుకుంటున్నా..
నాలోని ఉల్లాసానికి ప్రాణంపోసి బ్రతికించమని..
సర్వ పాప హరణా...
మహాదేవా శంభో...
నీవే దిక్కు...

Wednesday, February 28, 2024

శివోహం

గౌరీ మనోహరా...
కైలాసవాసా...
దయాసిందో...
భోళాశంకరా...
అన్ని పరీక్షలు పెడితే కానీ
నీ దారికి రానా అని ఇదంతా నాటకం?...
పరమేశ్వరా! నన్ను నీవే రక్షించుకోవాలి...
ఈశ్వరా
మహాదేవ
శంభో శరణు!శరణు! శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...