Sunday, March 3, 2024

అయ్యప్ప నా స్వామి

ప్రార్థించే ముందు నమ్ము...
నమ్మకమే నిజమైన ప్రేమ...
మాట్లాడే ముందు ఆలకించు...
అప్పుడే మాటలలో పటుత్వం ప్రేమ...
పొందే ముందు సంపాదించు...
అదియే నిన్ను ఆదుకొనే ప్రేమ...
రాసే ముందు ఆలోచించు...
వ్రాతలు హృదయాన్ని తాకే ప్రేమ...  
నిర్జీవమయ్యేలోపు అందరి గుండెల్లో జీవించు...
అదే కదా నిజమైన ప్రేమ.

ఓం శివోహం...సర్వం శివమయం.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివా!అడ్డుకన్నుల చూపు అడ్డుకుంటోంది
నిలువుకన్ను తెరచి నిన్ను చూడ
ఆ అడ్డు తొలగి నిన్ను నిలువునా చూడనీ
మహేశా . . . . . శరణు .

అయ్యప్ప నా స్వామి

ప్రార్థించే ముందు నమ్ము...
నమ్మకమే నిజమైన ప్రేమ...
మాట్లాడే ముందు ఆలకించు...
అప్పుడే మాటలలో పటుత్వం ప్రేమ...
పొందే ముందు సంపాదించు...
అదియే నిన్ను ఆదుకొనే ప్రేమ...
రాసే ముందు ఆలోచించు...
వ్రాతలు హృదయాన్ని తాకే ప్రేమ...  
నిర్జీవమయ్యేలోపు అందరి గుండెల్లో జీవించు...
అదే కదా నిజమైన ప్రేమ.

ఓం శివోహం...సర్వం శివమయం.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

Saturday, March 2, 2024

శివోహం

శివా!అంతటా నీవున్నా
కొంతగా నిను నిలిపి
పూజలే చేసేము ఫలము కోరి
మహేశా . . . . . శరణు .

శివోహం

నీ చరణ దర్శనం మా ముక్తి మార్గం
నీ పాద ధూలీ మా నుదిటి విభూతి
నీ అభయహస్తం
మాకు ప్రసాదించే అభయయం
నీ కమల నయనాలు కురిపించే కారుణ్యం
నీ వేణుగానం తో పరవాసించే సమస్త విశ్వం
నీ నామా స్మరన సర్వపాప హరనం
జగన్నాథ ఈ మాయ నుండి విడిపించి
మొక్ష మార్గం వైపు నడిపించు
పరంధామ కృష్ణ ముకుందా గోవింద.
హరే శ్రీనివాస..
ఓం నమో వెంకటేశయా.

శివోహం

శివ...
నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటావు....
కారణం లేకుండా ఏదీ జరగదు అంటావు...
కానీ కారణం తెలిసేనాటికి కాలాతీతం అయిపోతుంది.
నీ ఆటేమిటో...
నీ పాట ఏమిటో...
నీ లీల ఏమిటో తెలియకుంది నాకు...

మహాదేవా శంభో శరణు.
శివ నీ దయ.

Friday, March 1, 2024

శివోహం

శివా!కర్మ ఫలమున నేను కాగుచున్నాను
కార్య కారణుడవు నీవు గనుక
ఫలము అర్పిస్తా పరిగ్రహించు
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...