Wednesday, March 6, 2024

శివోహం

పొంగి పొరలుతున్న నీరు కంటి పొరలలో ఎక్కడ దాగి ఉందో.
నా కంటి వెనుక ఎంత లోతైన సముద్రం ఉందో.

శివ నీ దయ.

శివోహం

శివ!
నీ నామస్మరణ తలపులలో నా మనసు నిలిచి గూడుకట్టుకునెలా...
నీనామ జపంలో సర్వం మరచి మనసులో మైమరచి ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందుతున్న వేళ మౌనం సామ్రాజ్యం ఏలుతూ స్మరణ మనన ధ్యాన ధ్యాసలు నలుదిశలుగా భావించే భాగ్యం కలిగించు...
నీరూపం చూడగానే నా మనసు నీవలే ఘడియైనా నిలిచేలా దీవించు తండ్రీ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!గమనమేదైన గమ్యమొక్కటిగా
గుర్తెరుగేమన్నావు గమనించు చున్నావు
ఆ గతిని మా మతిని నిలుపుకోమన్నావు
మహేశా . . . . . శరణు .

Tuesday, March 5, 2024

శివోహం

శివ!
నీ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలని తపన...
నిన్ను ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండాలని కోరిక...
నీపై పదాలెన్ని అల్లినా మహా గ్రంధం
వ్రాయాలని ఉత్సాహం...
ఎలా తీరేను ఈ శివదాహం...
శివ నామామృతం ఒక్కటే మార్గమా...
త్రినేత్ర స్వరూపా
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ సంకల్పమస్తు
శుభ సంకల్పమస్తు
నా జీవిత చిత్రాలకు
నీవే! పర్యవేక్షణ దర్శకుడవు
పరమేశ్వరా! శరణు శరణు.

శివోహం

శివా!నీ సంకల్పం వలన నేను తెలిసాను
నా సంకల్పం వలన కర్మలు చేసాను
నా కర్మలన్ని కాలి  సంకల్పాలు ముగియనీ
మహేశా . . . . . శరణు

శివోహం

శాశ్వతమైన
ఆనందకరమైన
భుక్తి ముక్తిదాయకూడా
సకల పాప దుఃఖహరణ
దురిత నివారణము  ఓ పరమేశ్వరు నా చిత్తం నీ పై ఉండేలా  ...
నామరూప గుణ వైభవ స్మరణ లో నా జీవితాన్ని ధన్యత చేయవయ్య హర...
నీ కమలాలదివ్య దర్శన వైభవాన్ని అనుభవిస్తూ నీ పాదాల చెంత ముక్తిని పొందే భక్తి మార్గాన్ని దివ్యమైన ఆ యోగాన్ని అనుగ్రహించు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...