Wednesday, March 6, 2024

శివోహం

శివ!...
ప్రాపంచిక విషయం లో పడి మాయదారి మనసు ఒకే చోట నిలవడం లేదయ్యా...
నాజీవిత లోలక కంపన పరిమితిని స్థిరపరచి...
ఊపిరి ఊయలలో నీ నామం స్మరించేలా...
నా మనసు ఎక్కడ ఉంటే నీ పాదం అక్కడుంచు.

మహాదేవా శంభో శరణు...

శివోహం

పొంగి పొరలుతున్న నీరు కంటి పొరలలో ఎక్కడ దాగి ఉందో.
నా కంటి వెనుక ఎంత లోతైన సముద్రం ఉందో.

శివ నీ దయ.

శివోహం

పొంగి పొరలుతున్న నీరు కంటి పొరలలో ఎక్కడ దాగి ఉందో.
నా కంటి వెనుక ఎంత లోతైన సముద్రం ఉందో.

శివ నీ దయ.

శివోహం

శివ!
నీ నామస్మరణ తలపులలో నా మనసు నిలిచి గూడుకట్టుకునెలా...
నీనామ జపంలో సర్వం మరచి మనసులో మైమరచి ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందుతున్న వేళ మౌనం సామ్రాజ్యం ఏలుతూ స్మరణ మనన ధ్యాన ధ్యాసలు నలుదిశలుగా భావించే భాగ్యం కలిగించు...
నీరూపం చూడగానే నా మనసు నీవలే ఘడియైనా నిలిచేలా దీవించు తండ్రీ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!గమనమేదైన గమ్యమొక్కటిగా
గుర్తెరుగేమన్నావు గమనించు చున్నావు
ఆ గతిని మా మతిని నిలుపుకోమన్నావు
మహేశా . . . . . శరణు .

Tuesday, March 5, 2024

శివోహం

శివ!
నీ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలని తపన...
నిన్ను ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండాలని కోరిక...
నీపై పదాలెన్ని అల్లినా మహా గ్రంధం
వ్రాయాలని ఉత్సాహం...
ఎలా తీరేను ఈ శివదాహం...
శివ నామామృతం ఒక్కటే మార్గమా...
త్రినేత్ర స్వరూపా
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ సంకల్పమస్తు
శుభ సంకల్పమస్తు
నా జీవిత చిత్రాలకు
నీవే! పర్యవేక్షణ దర్శకుడవు
పరమేశ్వరా! శరణు శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...