Friday, March 8, 2024

శివోహం

ఈ శివరాత్రి వేళ బాగా గుర్తుకు వస్తోంది..
కాలం ఎత్తుకెళ్లిపోయిన నా రంగుల బాల్యం.

శివ నీ దయ.

శివోహం

శివా!నేలబారున నీకు ఈ పరుగులేల
నిలువమా కాసింత నందినడుగ
నిస్తేజమై పోయె నిఖిల జగతి
మహేశా . . . . . శరణు .

శివోహం

నా భుజము నా తట్టినా...
నీ చేయికై ఈ చేయి...
ఎంత  చేయవలెనో, ఎంత వ్రాయవలెనో...
మహాదేవా శంభో శరణు.

Thursday, March 7, 2024

శివోహం

శివ!
సకల జనులను చల్లగా చూడు...
నీవు అనుగ్రహిస్తున్న ఇలాంటి స్పూర్తిని, శక్తిని, వివేకాన్ని సదా మానవ కల్యాణానికి వినియోగించేలా మమ్మల్ని కరుణించు...
నీ సేవలో సదా తరించే మహాభాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ...

మహాదేవా శంభో శరణు

శివోహం

చెదరని జ్ఞాపకాల దొంతరలో ...
చేదు గురుతుల సమూహాలన్నీ నిను 
చేరుకునేందుకు సోఫానాలుగా మారాలన్నదే నా చిరకాల కోరక తండ్రీ ...
మహాదేవా శంభో శరణు...

Wednesday, March 6, 2024

శివోహం

శివ!...
ప్రాపంచిక విషయం లో పడి మాయదారి మనసు ఒకే చోట నిలవడం లేదయ్యా...
నాజీవిత లోలక కంపన పరిమితిని స్థిరపరచి...
ఊపిరి ఊయలలో నీ నామం స్మరించేలా...
నా మనసు ఎక్కడ ఉంటే నీ పాదం అక్కడుంచు.

మహాదేవా శంభో శరణు...

శివోహం

పొంగి పొరలుతున్న నీరు కంటి పొరలలో ఎక్కడ దాగి ఉందో.
నా కంటి వెనుక ఎంత లోతైన సముద్రం ఉందో.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...