Saturday, March 9, 2024

గోవిందా

గోవిందా..
నీను తలచినంతనే తన్మయత్వం కలిగించే నీ రూపం కన్నా మరో మత్తుమందుందా తండ్రి...
ఈ కలియుగంలో నీ నామస్మరణను మించిన
మైమరపు మరెక్కడిదయ్యా...
నా మనసు ఎటువంటి వికారాలకు లోనుకాకుండా సదా నీ నామ స్మరణలో మనసు మురిసే వరమీయవయ్యా ఆపధ్బాందవా.

హరే గోవిందా.
ఓం నమో వెంకటేశయా.

సేవభయ నీ దయ

నీవే సాక్షాత్ పరబ్రహ్మవి...
నీవే సర్వదా పూజార్హుడివి,
అవనిపై అలవోకగా జాలువారి జగతిని జాగ్రుతిచేసి
జాతిని ఏకతాటిపైకి నడిపిన మార్గదర్శి...
అక్షరాల మాల లల్ల తెలిపి,
అంకె గారడీల శంక తీర్చి...
జంకు లేక బ్రతుకు సాగ నేర్పు

ఓం గురుభ్యో నమః
జై సేవాలాల్
జై జై బుడియా బాపు.

శివోహం

చీకటి బతుకులే కానీ నిస్వార్థం, నిర్మలత్వం ఉన్న జీవితం...
కుళ్లు, కుతంత్రాలు లేని జీవనాలు..
చిల్లర బతుకులే సబ్బుబిళ్లను సగం ముక్క చేసి వాడుకుంటూ..
చిల్లులు పడిన పరుసులోనే చిల్లర పైసలు దాచుకుంటూ..
ఆకలి బతుకులే...
ఉన్న రోజు పరమాన్నం వండుకొని తింటూ..
లేని రోజు పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటూ..
మధ్యతరగతి బతుకులే...
చాలీ చాలని సంపాదనతో సంసారాన్ని నెట్టుకొస్తూ..
కష్టనష్టాలను, భాధ్యతల బరువుల్ని కూడా చిరునవ్వుతో మోస్తూ.
శివ నీ దయ.

శివోహం

శివా!అవని జీవులు ఆకాశాన అక్షులు
నీ తేజము నిండి నిన్ను గాంచె
నీ చైతన్య రూపాలై తెలియ మెరిసె
మహేశా . . . . . శరణు .

శివోహం

రాయంటి నా హృదయం కరిగిందే నీ నామస్మరణతోనే..
రేయిపగలు నీ నామ ధ్యానమే ఊపిరైందే నా దేహానికి.

శివ నీ దయ.

శివోహం

శివ!
నేను ఆనే ఈ దీపం కోండఏక్కే లోగా
నీ దయ కు పాత్రుడు అయ్యేలా దీవించు...
కష్టందేముంది కాలం తో పాటు వస్తుంది
కాలంతో పాటు వేలుతుంది
నీ కృపకు దారి తేలుపు చాలు

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ!
నేను ఆనే ఈ దీపం కోండఏక్కే లోగా
నీ దయ కు పాత్రుడు అయ్యేలా దీవించు...
కష్టందేముంది కాలం తో పాటు వస్తుంది
కాలంతో పాటు వేలుతుంది
నీ కృపకు దారి తేలుపు చాలు

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...