Monday, March 11, 2024

శివోహం

శివా !
నాకు...
నిన్ను మించిన శ్రేయోభిలాషి లేరు...
నీకన్నా గొప్ప ఉపకారి లేరు...
సదా దయచూపు తండ్రీ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!సురలోకమంతా చూసి మురియ  
సురగంగ జారేను జడను వీడి 
జై గంట మ్రోగేను భగీరథుని యింట
మహేశా . . . . . శరణు

శివోహం

తెరిచిన పుస్తకం నా జీవితం..

ప్రతిపేజీలోనూ నీ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ను ముద్రించుకుంటూ ఉంటా.

శివ నీ దయ.


శివోహం





శివాలయం లేని నా ఉరని చిన్న చూపు చూడకు...
పూజగది లేని అద్దె ఇల్లు నాకే ఇరుకుగా ఉందని తొంగిచూసి గుమ్మం నుంచే వెళ్లిపోకు...
పై రెండు కన్నా నా హృదయం చాలా విశాలమైనది...
నా గుండె గూటినే కైలాసం చేసుకో పరమేశ్వరా...
నీకోసం జారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు 
నన్ను ప్రశ్నిస్తున్నాయి...
ఎప్పుడు నిన్ను నేను కలుస్తానని...
ఎప్పుడు ఈ కన్నీళ్లతో అభిషేకించాలని....
మహాదేవా శంభో శరణు....

Sunday, March 10, 2024

శివోహం

బంధాలు - అనుబంధాలు
చైతన్యం శరీరాన్ని విడిచినా
సూక్ష్మదేహం పరిసరాలలో నిలిచి
పిలుస్తుందట...
భౌతిక శబ్దాలు మినహా మనకేమీ వినిపించవు కనిపించవు. అలాంటి సమయంలో మనమైనా, మనకైనా ఆ స్థితికి అతీతంగా ఉండాలంటే మన మౌనాన్ని ధ్యానానికి, సంభాషణలు శివదేవుని స్మరణకు కేటాయిద్దాం.
నిద్రను శివనామస్మరణకు అంకితమిద్దాం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నడకలన్నీ బ్రమలైతే తోడు నీడలు కష్టమే...
బంధాలు కనుమరుగైతే  మాటపట్టింపులు కష్టమే...
అనుబంధాలు తోడైతే సంపద నీరు గా మారడమే...
దేహానికి దాహమైతే మనసు వికలమే... 
జీవితం శృతి చేసుకోపోతే బతుకు బండి భారమే...
వాదన వేదన వదలకపోతే జీవితమంతా నరకమే.

ఓం నమః శివాయ.

శివోహం

అర్థం కాని ముడులే అన్ని...
చిక్కులు విప్పే చాకచక్యం తెలిసిన నీవు...
ఏమిచ్చినా నీ భిక్ష..
అదే నాకు శ్రీరామ రక్ష.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...