Wednesday, March 13, 2024

శివోహం

ఆవేదన, ఆరాధన..!

అనుక్షణం బ్రతుకును వెంటాడే జీవననాదాలే

శివోహం

శివా!నా వద్ద వున్నదొకటే ఎద కుసమం
అది ఇరువురికి అర్పించుట అసాధ్యం
అర్ధనారీశ్వరమై అగుపించు,కలిగించు మోదం .
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!
రెండు నాల్కల ధోరణి నాది కాదు...
నీనామమే నాకు తెలుసు...
నీ చిటికనేలు గోరుకే బ్రహ్మ కపాలం నేలపై పడింది నేనెంత?
నాబోటి అల్పునికి త్రిశూలం వరకూ ఎందుకు...
నాలో అహము లేచిననాడు నాపై నీ ఆయుధాలు ప్రయోగించు...
అంతవరకు నీవు నన్ను అక్కున చేర్చుకో హర
శ్రీరాముడు ఆంజనేయస్వామిని ఆలింగనం చేసుకున్నట్లు
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!
రెండు నాల్కల ధోరణి నాది కాదు...
నీనామమే నాకు తెలుసు...
నీ చిటికనేలు గోరుకే బ్రహ్మ కపాలం నేలపై పడింది నేనెంత?
నాబోటి అల్పునికి త్రిశూలం వరకూ ఎందుకు...
నాలో అహము లేచిననాడు నాపై నీ ఆయుధాలు ప్రయోగించు...
అంతవరకు నీవు నన్ను అక్కున చేర్చుకో హర
శ్రీరాముడు ఆంజనేయస్వామిని ఆలింగనం చేసుకున్నట్లు
మహాదేవా శంభో శరణు.

Tuesday, March 12, 2024

శివోహం

అవసరం నాది...
ఆశీస్సులు నీవే ఈశ్వరా...
ఉన్నది ఒక్కటే కోరిక...
శివ నీ  దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!సిద్దులేవి నేను కోరను దేవా
శుద్ధి చేయి నా మతిని ఎపుడూ
బుద్ధి కలిగి వుందు నిన్ను స్మరిస్తూ
మహేశా . . . . . శరణు .

శివోహం

ఏది జననం 
ఏది మరణం

ఏది వేదన
ఏది ఆవేదన

ఏది ఆశ
ఏది నిరాశ

ఏది సత్యం
ఏది నిత్యం

ఏది ఏకం
ఏది భిన్నం

ఏది ధైర్యం
ఏది భయం

ఏది నీది
ఏది నాది

అన్నీ ఒకటే
యోచిస్తే 
ఆలోచిస్తే
అర్ధం చేసుకుంటే

రెండుగా
కనిపించేవి
అన్నీ
ఒక్కటే

నీది
అనుకున్నది
కానిదే
నీవు
అదే నేను

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.