Friday, March 15, 2024

శివోహం

త్రిశక్తి స్వరూపిణి.....
త్రైలోక్య సంచారిణి....
అమ్మలగన్నయమ్మ.....
ముగురమ్మల మూలపుటమ్మ ....
ఇంద్రకీలాద్రిపై స్వయంభువై...
భక్తులను అనుగ్రహిస్తున్నవు.

అమ్మ కనకదుర్గమ్మ నీకు వందనం.....

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

నాకంటూ ప్రశాంతత ఎప్పుడొస్తుందో...
నేను హాయిగా ఎప్పుడు నిద్దరోతానో...
నాదంటూ ఒకరోజు ఏనాడొచ్చేనో...
అంతవరకూ నా చేతుల్లో లేదేదీ...
కానీ నాకు తెలుసు ఆ రోజు దగ్గరలోనే ఉంది...
శివ నీవు ఉన్నావు...
నాకు తోడై...
నావెంటే నీడై...
మహాదేవా శంభో శరణు.

Thursday, March 14, 2024

శివోహం

జన్మ జన్మల జ్ఞాపకాలు...
పాపాల రూపంలో గుర్తు వచ్చి మనసు మూలుగుతోంది
బాధతో, భయంతో.. ఎవరికి చెప్పుకోను...
నీకే అప్పచెబుతున్నాను దరిచేర్చుకో ప్రాణేశ్వరా.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ..
కష్టాల కన్నీళ్ళను గంగలో ముంచి
చంద్రునితో అమృతం కురిపించు...
నంది చెవిలో చెప్పిన కోరికలు నెరవేరేలా దీవించు...
కర్మలతో పాపక్షయం నీ వైపు అడుగులు పడేలా అనుగ్రహించు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!మా కన్నులకేమాత్రం కానకున్నా
నందిని కూడి మా వెంటే వుంటావని
తెలుసుకొనగ సత్యము కనుగొనగ కష్టము
మహేశా జ్. . . . . శరణు .

Wednesday, March 13, 2024

శివోహం

జీవుడే శివుడు
సమస్త భూతముల యందు శివుడే వ్యవస్థితుడై యున్నాడు ఈ విధముగా ఎవడు సత్యమును గాంచుచున్నాడో వాడే జీవన్ముక్తుడు.

ఓం నమః శివాయ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జన్మ జన్మల మన ఋణానుబంధం...

శోకంతోనే పెనవేసుకుంటోంది...
నువ్వు నేను కలిసే రోజే ఆ శోకం తీరుతుంది.

శివ నీ దయ.


శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...