Wednesday, March 20, 2024

శివోహం

నేను కూటికి పేదవాడిని....
నిన్ను పూజించుటలో కాదు...
ఇంకింత కష్టం ఇవ్వు....
నీ కాళ్ళ కాడే పడి ఉంటా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాధ పలుకగ నేలా?

#శ్రీమదాంధ్రమహాభాగవతం 
హారేరామ హారేకృష్ణ

Tuesday, March 19, 2024

శివోహం

మంచి అనుకున్నది వెంటనే చేసేయ్
చెడు అనుకున్నది ఆలోచించి అనవసరం..
అవసరం
అయితే తప్ప అటువైపు అడుగులు వేయకు...
భగవంతుడు ఏది అడిగినా ఇస్తాడు....
కానీ కర్మ అనుభవించాలసినది మనమే
అందుకే ఆలోచించి కోరుకోవాలి ఉంటారు...

ఓం నమః శివాయ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మనిషి జన్మ పాపపుణ్యాల మిశ్రమం...
ఎన్ని జన్మలెత్తినా పరంధాముని దివ్యధామం చేరలేని జన్మవ్యర్ధం...

జై శ్రీరామ్ జై జై హనుమాన్.

శివోహం

శివా!పాశాన్ని పట్టుకొని పదము చేరి       
ధర్మమే తోడుగా నడిచొచ్చే నాకు     
గమ్యాన్ని గుర్తెరుగగ నీవే నాకు తోడు
మహేశా . . . . . శరణు .

శివోహం

నీ చూపు కై ఈ నిరీక్షణ

అదే మా ఆత్మకు రక్షణ.

మహాదేవా శంభో శరణు.


గణేశా

గణనాయక జగ వందన...
శంకర పార్వతి నందనా...
సహస్ర ముకుట పీతాంబర...
శంభోసుత లంబోదర.
సిద్ది వినాయక భావ భయ నాశన...
సుర ముని వందిత శ్రీ గణేశా...
విశ్వా ధారా వినాయక...
శరణు వినాయక శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...