Monday, March 25, 2024

హరే గోవిందా

స్మరణ జొచ్చుట నావంతు
 - కర్మను తీర్చుట నీవంతు 
పూలతొ పూజించు నావంతు
 - సంపద పంచుట నీవంతు      
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

మోక్కులు తీర్చుట నావంతు 
- శాంతిని ఇచ్చుట నీవంతు  
కోరిక చెప్పుట  నావంతు
 - మాటను నిల్పుట నీవంతు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

పరమపురుష శ్రీపతివి నీవైనావు   
పరిపూర్ణ లక్ష్మీ పతివి గా ఉన్నావు 
భక్తులకు పరమాత్మగా మారవు   
మమ్మల్ని ఆదుకొనే మహాపురుషుడ వైనావు   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

శివోహం


మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!సర్వము నీవని తెలిపేవు
చెరి సగముగ యిరువుని చూపేవు
తెలిసినదొకటి తెలిపినదొకటి యిది యేమిటి
మహేశా . . . . . శరణు .

శివోహం

మలినం నిండిన శరీరం పై...
మమకారం లేదు కానీ...
లో లో ని బిందు స్వరూపం...
నీ సన్నిధి కోరుకుంటుంది.
మహాదేవా శంభో శరణు.

Sunday, March 24, 2024

శివోహం

శివా!కాళీ యని నీవు కవ్వించ
తపముకేగి అరుదెంచె గౌరిగా 
ఆ రీతి కవ్వించు నన్ను ,నీవగునట్లు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!స్మరణ నీవు శరణు నీవు
చరణు నీది కరుణ నీది
ఇక స్పురణకేమి లోటు
మహేశా . . . . . శరణు .

శివోహం

నా నడకలో నీ నామమొకటే తోడుగా ఉండేది...

నిన్ను చేరే దారిలో భయమేమి కలగకుండా నీవే ధైర్యం కల్గించాలి.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...