Saturday, March 30, 2024

శివోహం

శివ!
కలలు కన్నజీవితం కలిమయాలో చిక్కి కల్లోల కడలి అవుతుంది..
ఇక నాకు మిగిలినది కలవరమే...
నీ కరుణతో కడలినే క్షీరమయం చేసి కలిమయా నుండి తప్పించు.

మహాదేవా శంభో శరణు.
ఓం పరమాత్మనే నమః.

Friday, March 29, 2024

శివోహం

శివా!ఏమిటి ఈ సర్దుబాటు
ఎన్నాళ్ళీ ఎడబాటు వేగలేకున్నాను
వేగిరపడు  నాకు సహాయపడు
మహేశా . . . . . శరణు .

శివోహం

మలినం నిండిన శరీరం పై...
మమకారం లేదు కానీ...
లో లో ని బిందు స్వరూపం...
నీ సన్నిధి కోరుకుంటుంది.


మహాదేవా శంభో శరణు.


శివోహం

ఏమివ్వగలను తండ్రి నీకు
నీవిచ్చిన భిక్ష లో అక్షరము తప్ప.
మహాదేవా శంభో శరణు.

Thursday, March 28, 2024

శివోహం

తనువుకు తలపులు కలిగించి..
మనసు తలుపులు తెరిపించి...
"నేను" గురించి శోధన చేయించి...
"ఆత్మ" నేనేనని తెలుపు పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!కన్నవారు లేని నిన్ను
కన్నవారు ఎందరో కదా 
కలసిపోనీ నన్ను కన్నవారితో
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!కన్నవారు లేని నిన్ను
కన్నవారు ఎందరో కదా 
కలసిపోనీ నన్ను కన్నవారితో
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...