శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Sunday, March 31, 2024
శివోహం
శివ!
నా ఆత్మను నీకు అర్పితం చేసినా...
ఇంకా నాతో ఈ ఆట లేల...
ఈ పాట లేల...
ఈ రాత లేల...
నా ఈ శరీరం మిగిలి ఉన్నందుకా...
ఈ కట్టే కాలాక మిగిలే బూడిద నీకె కదా అయ్యా.
మహాదేవా శంభో శరణు.
శివోహం
సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి...
ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు...
ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది...
ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది...
సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం.
Saturday, March 30, 2024
హరే గోవిందా
కోరికలు దుఃఖానికి కారణం...
వాటిని అదుపు చేయటమే దుఃఖ నివృత్తి...
జన్మంతర సంస్కారంలే మనసు యొక్క కోరికల ద్వారా బహిర్గతం అవుతాయి. మనసు రూప రహితంగా, నిగ్రహించ దానికి దుస్సాహమై,బుద్ది గృహ లో ఇమడలేక కోతి లా అసహహనo గా విశ్వ మంతా తిరిగేదే మనసు.అదుపు లేని మనసు అధర్మం ను ఆనుసరించి జీవితం ను దుఃఖం లో ముంచుతుంది.ఎద్దుల వెంట బండి లా అధర్మం వెంట దుఃఖం నడుస్తుంది..
బంధ విముక్తి కి కారణం ఈ మనస్సు.
సన్మార్గం లొ నడిచే మనసు తల్లీ, తండ్రులు లాగా సుఖ శాంతులు అందిస్తుంది.
మనసు యొక్క స్థూల రూపం దేహం. కోరిక లేకపోవటం మనో నాశనము. మనో నాశనం మే ముక్తి.
ఓం నమో వెంకటేశయా.
శివోహం
శివ!
కలలు కన్నజీవితం కలిమయాలో చిక్కి కల్లోల కడలి అవుతుంది..
ఇక నాకు మిగిలినది కలవరమే...
నీ కరుణతో కడలినే క్షీరమయం చేసి కలిమయా నుండి తప్పించు.
మహాదేవా శంభో శరణు.
Subscribe to:
Posts (Atom)
గోవిందా
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...
-
శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! సకల ఘటనలను సులువుగా రచియించి, అందులో తోసేవు మమ్ములను తోలుబొమ్మలను చేసి, ఆ పాత్రదా...