Thursday, April 4, 2024

శివోహం

ఆశలు కరిగి నీరవుతున్న కొద్దీ...
మనసు బరువెక్కుతూనే ఉంది...
నా మనసేరిగిన వాడివి నీవు...

శివ నీ దయ.

శివోహం

శివ!
చింతలను విడనాడాలంటే చీకటే మేలని...
సాధనతో నన్ను సానపెడుతున్నావు…
శ్రేష్ట కర్శలచేత బుణములను కరిగించి స్వేచ్ఛ నిస్తున్నవు...
నీ చేరువకే కదా శివా…

మహాదేవా శంభో శరణు.

Wednesday, April 3, 2024

శివోహం

శివ!
నా గుండె సవ్వడిలో కన్నీటి జలధార...
నా తండ్రి పరమేశ్వర నీకు నిత్యాభిషేకాలే...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!ఆత్మతో అనుసంధాన మైన నీవు
సూత్రంగా వ్యవరించు తున్నావు
నాలో మంత్రంగా ప్రతి ధ్వనిస్తున్నావు
మహేశా . . . . . శరణు

శివోహం

శివ!
నా ఆశలు వూసులు నితో చెప్పాలని ఆర్తి తో ఉన్న నన్ను నీ ఒడి కి చేరదీసి నీ చెంత లాలించు...
నా తండ్రి శివ నీ హుదిలో పసిపాపల శాశ్విత స్వాంతన పరుచు.

మహాదేవా శంభో శరణు.

Tuesday, April 2, 2024

శివోహం

ఈ లోకములో ఎవరికి వారే స్వతంత్రులు
ఒకరి మీద మరొకరికి ఎటువంటి అధికారములు లేవు
ఈ లోక సంబంధాలన్నీ కేవలం దైవ భావనతో దైవ ప్రేమతో అవసరానికి వాడుకొని వదిలేసేవే
చివరకు ఒంటరిగా ఈ లోకానికి వచ్చిన తాను ఒంటరిగానే మిగిలిపోవలసిందే.

ఓం పరమాత్మనే నమః

శివోహం

శివ!
నీడ లేని నా మనసు...
నీ జాడ కోసం తిరుగుతూ...
బంజరు భూమి పై ఉండలేక దహించి దహించి...
సూక్ష్మాతి సూక్ష్మమై,తేలికయై శూన్యం లో కలిసిపోతుంది…
నీవు ఆడించే ఆటలో ఇది ఒక ఘట్టం.
కానీ నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి.

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...