Saturday, April 6, 2024

శివోహం

నీ నామం శివం…
నా జీవనమే శవం...
నీ నామము తోనే  జీవనం...
శివం లోనే శవం...
ఇదియే కదా నా జన్మ రహస్యం.

మహాదేవా శంభో శరణు.

Friday, April 5, 2024

గోవిందా

భక్తి అంటే దేవుని భజించడం
అంటే భగవంతుని ప్రేమించడం
ఆరాధించడం
మనసుతో  సదా సర్వకాలం
తలుస్తూ  కొలుస్తూ ఉంటు
అదే శ్వాసగా
అదే ధ్యాసగా
అదే జీవితంగా
అదే ధ్యేయంగా ఎంచుకునే చెదరని
తరగని శాశ్వత సంపద భక్తి...

ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మళ్ళీ పయనించాలనుంది మురిపించే బాల్యంలోకి...
అమ్మ నీతో నడిచే తొలియడుగుల భాగ్యానికై.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నంటే
అమ్మ శరణు

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

శివ!
ప్రతిక్షణమూ నాలో ఉల్లాసం ఎగిసిపడేందుకు..
నీవు కాలానికే రంగులేసేస్తావు.

శివ నీ దయ.

శివోహం

శివా!నీ డమరుక నాదాలు నిత్యం
అక్షరములుగ అవతరించి
పదాలై ప్రబంధాలుగా ప్రభవిస్తున్నాయి
మహేశా . . . . . శరణు .

శివోహం

జీవితంలో ప్రతి ఒక్కటి పరమాత్మా అనుగ్రహంతో  ఇవ్వబడ్డవి ...
తల్లి  తండ్రులు ,భార్య  బిడ్డలు ,ఆస్తిపాస్తులు...
ఈ  జన్మ మనం తెచ్చుకున్నది కాదు...
కాబట్టి  ఎప్పుడో ఒకసారి  మల్లి  తీసేసుకుంటాడు  దేని  మీద  మనకి  హక్కులేదు...
మనం  తెచ్చుకోలేదు   కాబట్టి  ఇది  నాది  అని మమకారం  పెంచుకోవడం  లాంటి  భ్రమ  తగదు...
ఏది  నీది  కాదని  తెలుసుకో  ఎదో  నాటికీ .
మనం  ఏంచేస్తున్నాం  అన్ని ననావిగా భావించి  బంధించి
బడుతున్నాం...
నాది అంటే బంధము
నాది కాదు అంటే  మోక్షము .
నాది అంటే  అపచారము
పరమాత్మా  అంతా  నీది  అంటే ఉపచారము

శివోహం


శివ!
జయ విజయులను తప్పించుకొని నిన్ను చేరాలనుకుంటున్నాను
నిన్నూ, అమ్మని,  ప్రార్ధించి, మీ పాదాల చెంత ఉండాలనుకుంటున్నాను...
కళ్ళు మూసిన, కళ్ళు తెరిచినా, నీ రూపాన్ని తలుస్తూ ఉన్నాను...
నా తండ్రివి నీవు, నా రక్షకుడవు నీవే శివ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...