Monday, April 8, 2024

శివోహం

శివ!

నన్ను కూడా నంది లా నీ లాలన లో ఉంచు...
నీ పాలన లో పెంచు…

మా చింతలను చెరపి…

నీ చెంతను ఉంచు.


మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నింద నిలువ లేదు నిన్ను చేరి
స్తుతిగా మారేను నిన్ను తెలిసి
ఏమి మర్మమో ఇది  తెలియగనుక
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!తంబురా మీటుతూ అంబరాన తిరుగుతూ
నారాయణ అంటూ నిన్ను చూడ తెలిసాను
నారాయణ స్మరణతో నిన్ను చూడ వచ్చాను
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ!
నీ ఢమరుక నాదం మోగుతూ ఉంటే…..
ప్రకృతి తాండవం ఆడుతూ ఉంటే….
నా ఉహలో ఊయల ఊగే రుద్రాకారం నీ ఓంకారం.
మహాదేవా శంభో శరణు.

Sunday, April 7, 2024

శివోహం

నీ తలపుల మెరుపులే నాలో కాంతిలహరులై చూపును వెలిగిస్తుంది.

శివ నీ దయ.

శివోహం

శివ!
నా ఊపిరినే నీ జపమాల
ఉఛ్వాసనిశ్వాసలే నీ స్మరణా...
నా అశ్రువులే నీకు అభిషేకం...
ప్రతిపలుకూ నీ శ్లోకమే...
నా మౌనం నీ ధ్యానం...
నా జీవితం నైవేద్యం.

శివ నీ దయ.

శివోహం

నీ తలపుల మెరుపులే నాలో కాంతిలహరులై చూపును వెలిగిస్తుంది.

శివ నీ దయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...