Wednesday, April 10, 2024

శివోహం

శివ!
ఆశ అనెడి కొమ్మలపై నాట్యము చేయుచున్నది నా మనసు....
దురాశ వల్ల నీ పాదారవిందములు నానుండి దాచబడినవి....
నా నుదుట వ్రాసిన రాతను మార్చడములో నీవే అశక్తుడవు...

మహేశా శరణు శరణు....

శివోహం

శివా!సూత్రము నీవు చత్రము నీవు
మూలశక్తితో మిళితము నీవు
మననము చేయగ మంత్రము నీవు
మహేశా . . . . . శరణు .

శివోహం


ఆడేది నేనె ఐనా...
ఆడించేది నీవు...
అంతటా ఉన్నది నీవే,
అందరిలో ఉన్నది నీవే...
నీపై శ్రద్ద కలిగించేది నీవే
అజ్ఞానంలో ఉంచేది నీవే...
కర్మ తగిలించేది నీవే,
కర్మ తీసివేసేది నీవే... 
జన్మ ఇచ్చేది నీవే,
జన్మలేకుండా చేయునది నీవే..

మహాదేవా శంభో శరణు.

Tuesday, April 9, 2024

శివోహం

శివ!
మంచి గంధానికి చల్లగాలి తోడైనట్టుంటుంది...
నీ భక్తి పరిమళం.

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఏ కానుక పుచ్చుకుందో కన్నీరు...
మనసును ఓదార్చుతూనే ఉంది.

శివ నీ దయ.

శివోహం

శివా!నీ వాసమేదనిన చూపలేము
నీ రూపమేదనిన చెప్పలేము
నామ మంత్రముననే తెలియనగును
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ!

చింతలతో చేరిన నీ చెంతకు…

చిరునవ్వు తో చూసి...
నాపై చిరు హాసం కురిపించు..
అన్యదైవం ఎరుగా...
అన్యకోరికలు కోరా.

మహాదేవా శంభో శరణు.


శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...