Monday, April 15, 2024

శివోహం

అస్త్రము తెలీదు...
శస్త్రము తెలీదు...
శాస్త్రము అసలే తెలీదు... 
నిమిత్త మాత్రుణ్ణి నిర్ణిత సమయాన్ని సద్వినియోగ పరుచుట తప్ప 
నాకు ఏమీ తెలియదు హర...
నీ దివ్య రూపమునకు అభిషేకముతో ఆత్మార్పణము చేస్తున్నాను 
నాలో ఆవరించి చీకటిని తొలిగించి వెలుగును అందించు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నిన్ను చుట్టేస్తానని వచ్చిన గంగ
నీచే తలను చుట్టబడిపోయె
పిదప నీకు చుట్టమైపోయె
మహేశా . . . . . శరణు .

Sunday, April 14, 2024

శివోహం

మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ...
కారణం లేకుండా భక్తిరాదు...
కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు...
భగవంతుని మీద ఇంత ప్రేమ, భక్తి ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకుంటే కారణం కనబడకూడదు...

ఓం శివోహం.. సర్వం శివమయం.

శివోహం

శివా!ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు
నేను నిను తెలియు
తిరునాళ్ళు ఎన్నాళ్ళకు
మహేశా . . . . . శరణు .

Saturday, April 13, 2024

అమ్మ దుర్గమ్మ

కలలు అలలు అలలుగా ఎగసిపడుతుంటే
కలలు కలత నిదురగామారుతుంటే
కలలు కల్లలు కావని కళ్ళు చెబుతుంటే
కలలు కనమని మనసు పోరుతుంటే
కలలు ఎదలోతులగాయాలై రగులుతుంటే
కలలు కలకాలం నిలవాలని కోరుతుంటే
కలలు నిజమవాలని వనదుర్గ వరములిస్తే
కలనైనాఅనుకోలేదు నా కలలు కన్నీళ్ళవు తాయని.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా
అమ్మ దుర్గమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

వేల వేల కనులున్న చాలవు నీ బ్రహ్మోత్సవములు వీక్షింపగ...
వేల వేల చెవులున్న చాలవు అన్నమయ్య కీర్తనలు వినగ...
వేల వేల చేతులున్న చాలవు ఆళ్వారుల సేవను మించగ...
వేల వేల నోరులున్న చాలవు నీ దివ్య గానము చేయగ.

శ్రీహరి శరణు తండ్రి శరణు.
జై శ్రీమన్నారాయణ
ఓం నమో వెంకటేశయా.

శివోహం

శివ!
అరిషడ్వర్గాలతో ఊరేగుతున్న ఈ మనిషిని మార్చి ద్వేషాన్ని, రోషాన్ని తొలగించి భక్తిని పెంచి...
శిథిలాల వ్యవస్థలో ఉన్న ఈ దేహం పునరుద్ధరించు
మానవత్వం తో నింపి నిత్యమంగళకరమైన నీ దేవాలయంగా మార్చుకో..

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...