Tuesday, April 16, 2024

శివోహం

గణాధిప నమస్తే 
ఉమాపుత్రాయ నమస్తే
శివపుత్రాయనమస్తే 
విఘ్నరాజాయ నమస్తే
ఏకదంతాయ నమస్తే
మూషిక వాహన నమస్తే
కుమారగురవే నమస్తే
వక్రతుండాయ నమస్తే 
సిద్ధి వినాయక నమస్తే
బుద్ధి వినాయక నమస్తే
లాభ వినాయక నమస్తే
క్షేమ వినాయక నమస్తే

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఓ త్రిపురాసుర సంహారి
నిలువు కంట చూడు ఒకసారి
నేను లేకపోదు నిన్ను తెలిసి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ!
కోరికల మెట్లపై సాగిపోయే జీవితానికి లక్ష్యం ఏముంటుంది పరమేశ్వరా...
నా జీవన విధానానికి స్పష్టీకరణలు అంటూ ఏమీ లేవు...
చేయి కాలిన వేళ గుర్తు వస్తున్నావు అదే బాధా...
బంధాలు బంధుత్వాలు అవసరాలు సర్దుబాటు అయ్యాకనే నీ గురించి ఆలోచిస్తున్నను నను మన్నించు పరమేశ్వరా...
నిను చేరే దారి చూపించు.

మహాదేవా శంభో శరణు.

Monday, April 15, 2024

శివోహం

శివా ! నీవు సదా శివుడవే 
నేను నీకు సదా వశుడనే
నీ దివ్య రూపమునకు పరవశుడనే
శివా ! నీ దయ

శివ నీ దయ

..

శివోహం

అస్త్రము తెలీదు...
శస్త్రము తెలీదు...
శాస్త్రము అసలే తెలీదు... 
నిమిత్త మాత్రుణ్ణి నిర్ణిత సమయాన్ని సద్వినియోగ పరుచుట తప్ప 
నాకు ఏమీ తెలియదు హర...
నీ దివ్య రూపమునకు అభిషేకముతో ఆత్మార్పణము చేస్తున్నాను 
నాలో ఆవరించి చీకటిని తొలిగించి వెలుగును అందించు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నిన్ను చుట్టేస్తానని వచ్చిన గంగ
నీచే తలను చుట్టబడిపోయె
పిదప నీకు చుట్టమైపోయె
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...