Friday, April 26, 2024

శివోహం

జననమన్నది రోదన...
మరణమన్నది యాతన…
మరి నడి మధ్యన ఉన్నది...
సుఖమా?...
సంతోషమా?...
శాశ్వతమా?...
ఎరుక తెలిసిన నా నాధుడువి నీవు ఎరుక పరచవయ్య కైలాసాగిరి వాసా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!తెలుపు నలుపున నీవు తెలియవచ్చేవు
నలుపులో తెలుపును చూడ చెప్పేవు
ముక్కంటి చూపున జ్ఞానమిచ్చేవు
మహేశా . . . . . శరణు .

Thursday, April 25, 2024

శివోహం

శివా!ఎగుడు దిగుడు కళ్ళు ఏమి అందమో
గొడ్డు తోలు కట్ట ఏమి ఆనందమో
ఎరుక చేయి నాకు నీ ఎఱుకనిచ్చి..
మహేశా . . . . . శరణు .

శివోహం

అన్నీ విడిచి వచ్చినపుడు 
అక్కునచేర్చుకొని ఆదరించువాడు 
ఆ శివుడే ..

Saturday, April 20, 2024

శివోహం

శివా!తొలినాళ్ళలో నీకు జోతలన్నాను
మలినాళ్ళలో  మెలగ దండాలన్నాను
ఇన్నాళ్ళకు సర్వం సమర్పణమన్నాను
మహేశా . . . . . శరణు .

Friday, April 19, 2024

శివోహం

శివ నీ దయ

శివోహం

శంభో...
జీవితంలో ఎన్నింటినో దాటుకుని...
ఎన్నింటినో పోరాడి...
ఎన్నింటికోసమో ఆరాటపడి...
జీవితం మొత్తం అనుక్షణం జీవించడానికే ఆశపడుతూ...
చివరికి పిడికెడు మట్టి గానో...
పిడికెడు బుడిదగానో మారడానికే కదా...
కానీ నా ఆరాటం ఆ పిడికెడు బుడిది నీకు భస్మం అయితే చాలు తండ్రి...

మహదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...