Tuesday, April 30, 2024

శివోహం

శివోహం

ఓ శివా! పరమేశ్వరా! ఆదిభిక్షూ! 
నా మనస్సు అనే కోతి ఎల్లప్పుడు...
మోహమనే అడవిలో తిరుగుతూ....
కామము అనే కొండలపై విహరిస్తూ....
ఆశలనే కొమ్మలపై ఆడుతూ ఉంటుంది.....
అత్యంత చపలమైన ఈ కోతిని.....
భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి....
నీ అధీనములొ నుంచుకొనుము...
మహాదేవా శంభో శరణు....

Monday, April 29, 2024

శివోహం

శివో
మహేశ్వరః
శంభుః
పినాకీ
శశిశేఖరః
వామదేవో
విరూపాక్షః
కపర్దీ
నీలలోహితః
ఓం నమః శివాయ.

శివోహం

శివా!మరణాన్ని తలపించే జన్మలొద్దు
జన్మలు తొలగేలా మరణమీయి
ఏదైనా నీకు సాధ్యమే ఏమీ అనుకోకు
మహేశా . . . . . శరణు .

శివ ని5 దయ

శివోహం

*న* నమకం చమకం లింగాష్టకం...
*మ* మధురం వికసం కైలాసం...
*శి* శివోహం బ్రహ్మం కపాలం...
*వా* వాహనం నందిమ్ ఉల్లాసం...
*య* యదార్థం భస్మం జీవనం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ!
నా ఈ పయనం…

సాగే జీవన పయనం
ఊగే ఊహల శయనం
ఆశ నిరాశల లోలకం
నా ఈ పయనం…
ఎల్లలు ఎరుగని పయనం
కల్లోల కడలికి వయనం

లోక అలోకాల  సంధానం

పాప‌ పుణ్యాల  సావధానం
జనన మరణ  సాగరం.


మహాదేవా శంభో శరణు.


  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...