Thursday, May 9, 2024

శివోహం

శివా!శూలపాణిగ తెలిసున్నాము
వీణాపాణిగ చూస్తున్నాము
వీణలో వాణినే కంటున్నాము
మహేశా . . . . . శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
సంతోషం లో
నాకు ఆకలి, దప్పిక తీరినప్పుడెపుడూ నీవు గుర్తు రావడం లేదు...
దుఃఖం కొంచెం కలిగినా, నీకిది తగునా అంటూ నిన్ను నిందిస్తూ ఏడుస్తాను నిన్నే తలుస్తాను...
ఈ కూసింత జీవితం కాసింతా నీకై తపించనివ్వు ఇలానే నన్ను తరించనివ్వు...

మహాదేవా శంభో శరణు.

Wednesday, May 8, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
పరమాత్మ ఒక నమ్మకం
మన చేతిలో లేనిదేదో
మరేదో తెలియని శక్తి
తన చేతుల్లోకి తీసుకుని
సరైన దారిలో నడిపిస్తుందన్న
ఒక విశ్వాసం…

భగవంతుడు ఒక ఆశ
అంతా మంచే జరుగుతుంది
ఆపైవాడే చూసుకుంటాడు
ఆ తెలియనివాడే ఆదుకుంటాడన్న
ఒక మానసిక ఆసరా….

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే...
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే...
సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి...
ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం...
ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం...
ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

ఓం నమః శివాయ

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అమ్మవారి సర్వస్వం అయ్యవారి సొంతం
అయ్యవారి జీవితం అమ్మవారి మిళితం
అమ్మవారి చిరునవ్వు అయ్యవారి ఆనందం
విడివిడిగా ఊహించని లోకానికి ఆదిదంపతులు
వీరిరువురు కలిసిచూపే కరుణే మన జీవితం...
ఆదిదేవుడు,ఆదిపరాశక్తి ఆనందరూపమే అర్ధనారీశ్వరం
ఒకరి కోసం ఒకరి జీవితం అనే పరమార్ధమే అర్ధనారీశ్వరతత్వం.
ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

శివా!వేణు మాదవుడు నీ చెంతనుండ
వేణువు వూదుచున్నావా వేడుకగా
విశ్వమంత మురిసేను నీవు తెలిసి
మహేశా . . . . . శరణు .

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అమ్మవారి సర్వస్వం అయ్యవారి సొంతం
అయ్యవారి జీవితం అమ్మవారి మిళితం
అమ్మవారి చిరునవ్వు అయ్యవారి ఆనందం
విడివిడిగా ఊహించని లోకానికి ఆదిదంపతులు
వీరిరువురు కలిసిచూపే కరుణే మన జీవితం...
ఆదిదేవుడు,ఆదిపరాశక్తి ఆనందరూపమే అర్ధనారీశ్వరం
ఒకరి కోసం ఒకరి జీవితం అనే పరమార్ధమే అర్ధనారీశ్వరతత్వం.
ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...