Monday, May 13, 2024

శివోహం

శివా!దేహ రూపములిచట దగ్ధమయ్యేను
భేదమెరుగక యిచట భస్మమే మిగిలేను
ఘనమయ్యేనో గంగలో కలిసేనో నీకే ఎరుక
మహేశా . . . . . శరణు .

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శరీరమే  కదిలించే రథము 
రథానికి ఆత్మయే రధికుడు  
రధికునకు సారధి బుద్ధి 
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు 
ఇంద్రియాలే కదిలే గుర్రాలు 
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం 
కళ్లెం అనేది జీవిలో మనస్సు  

కర్మల వళ్ళ కలుగు ఫలం 
ఫలం వళ్ళ పెరుగు భోగం 
భోగం వళ్ళ కలుగు వాసన 
వాసన వళ్ళ కలుగు జన్మ  

జన్మ వాళ్ళ చేయాలి కర్మ 
కర్మలే ఫల సుడి గుండాలు 
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి 

అంటే పరమాత్మ ధ్యానమే 
అదే ఆత్మ జ్ఞానము 
దీనికి లింగ బేధము లేదు 
దీనికి నిత్యకర్మ నిష్ఠ 
న్యాయ ధర్మ సత్యానికి శాంతి 
అదే మనకు ప్రశాంతి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, May 12, 2024

శివోహం

శివా!ప్రతి రూపం నీ ప్రతిరూపం
ప్రతీ నామం నీ రూపానిదే
ఇన్నిగా వుంటే,ఎన్నగా యెటుల
మహేశా . . . . . శరణు .

మణికంఠ

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఏ బేధం లేని మనసుకు బాధ ఎలా మణికంఠ...
ఏ కష్టం లేని హృదయంబు ఖంగు ఏల 
ఏ ఆశ లేనట్టి నాకు ఈ నిరాశ నాకు ఏల 
శుభోదయమే మిము చూచిన నా హృదయ మందు 
క్రొత్త యుత్సాహమే కల్గునెల...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అజ్ఞానమును మించిన దారిద్ర్యము...
ఆత్మ జ్ఞానమును మించిన గొప్ప సంపద...
అహంకారమును మించిన గొప్ప విపత్తు మరొకటి లేదు.

ఓం నమః శివాయ.
శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
గుండెలోన పొంగుతోంది హాలాహలం...
నీ లాగా మింగలేక
బాధను దిగమింగలేక
ఏమిచేయ పాలుపోక
మునుపటిలా ఉండలేక
మనసంతా మలినమై
ఉచ్చ్వాసే అనలమై
మిగిలినాను జడుడిలా
మహాదుఃఖ కడలిలా.
మహాదేవా శంభో శరణు.

Saturday, May 11, 2024

అమ్మ

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
నాన్న (శివుడు ) నా కథ కు దర్శకుడు..
అమ్మ నా కథ అంత నీ పర్యవేక్షణలో వ్రాసిందే...
నా కథ అంత నీకు తెలిసిందే ఇక చెప్పేదేముంది?
నా కథనాన్ని అనువుగా మార్చు..
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...