Friday, May 17, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
రేయీ పగలు ఒకటే దిగులు!?...
రేపు ఏమగునోనని?...
నీ కనుల వేడి ఈ మహమ్మారిని హరించునట్లు ఆ కన్ను తెరిచి చూడు త్రినేత్రుడా...
మౌనం వీడి మాకు అండగా నిలబడు పరమేశ్వరా.
మహాదేవా శంభో శరణు.

హరే గోవిందా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శ్రీనివాసా!!! 
శ్వాస చేరి గాంధర్వ మాయె...
మౌనం వీడి మంత్రం ఆయె...
పలుకు కూడి జపం ఆయె...
క్షణాలు జారి జ్ఞాపకమాయె...
నడక మారి కాలమాయె...
నవ్వులు పూసి పూవులాయె...
పిలుపు బాణి పాటలాయె.

గోవిందా శరణు తండ్రి శరణు.
ఓం నమో వెంకటేశయా.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
నంది చెవిలో చెప్పిన మాట
ఎదో ఒకరోజు అడిగి అడిగి
మరచిపోతాడులే అని పట్టించుకోకుండ ఉండకు తండ్రి
నా పరిస్థితులు మార్చి మార్చి నన్ను మరిచి పోయేలా చేయకు...
కష్టాలు పరీక్షలు పెడితే విసిగి దూరమయ్యేవాడిని కాను...
పట్టిన నీ పాదం పట్టు వదలకుండా
ఆ కోరికప్రతి శ్వాసలోనూ నిన్ను అడుగుతూనే ఉంటాను
ఆఖరిశ్వాస వరకూ

మహాదేవా శంభో శరణు

శివోహం

శివయ్యా

ఎంత చతురత నీది

అడిగి అడిగి
ఎదో ఒకనాడు
మరచిపోతాడు
అని
పట్టించుకోవటం
మనకు సుమా

పరిస్థితులు
మార్చి మార్చి
నన్ను ఏమార్చాలానా

కష్టాలు పరీక్షలు
పెడితే విసిగి
దూరమవుతానానా

వెతలు వేదనలు
కలిగిస్తే
నిను మరచిపోతానానా

అపజయాలు అవమానాలు
ఏర్పరచితే
నీపై కినుక వహిస్తాననా

ఎంత మాయ
ఎంత రచన

ఎరుగవా నీవు
నేను 
పుట్టింది
పెరిగేది
గిట్టేది
నీ సన్నిధి కోసమే అని 

ఆ కోరిక
ప్రతి శ్వాసలోనూ
నిన్ను అడుగుతూనే ఉంటాను
ఆఖరిశ్వాస వరకూ

అప్పుడు
నిన్ను చేరే భాగ్యాన్ని
తప్పక ఈయాలిగా

శివయ్యా నీవే దిక్కు


Thursday, May 16, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అంతరంగమున అవతరించిన కరుణ దాయిని.
జీవుహితమునకు దారిచూపేటి జీవకారిణి.
అంతర్యామి లో కొలువై యున్న ఆర్యాణి.
విశ్వమంతట నెలవై యున్న విశ్వధారిణి.
జీవుకోటికి భుక్తిదాయిని.
నరుల పాలిట నీరజాక్షిణి.
భూతప్రాణులకు భద్రకాళివి.
పుణ్యజీవుల మోక్షదాయిని.
శ్రేష్టజీవులకు కల్పదాయిని.
హీనజీవులకు శక్తి దాయిని
నిర్భాగ్యులకు భాగ్యదాయిని
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

శివా!భావించు రూపాన్ని చిత్రించుకున్నాను
ఆ చిత్రాన్ని చిత్తాన స్థిరము చేసాను
స్థిరమైన రూపాన్ని స్మరణ చేసాను .
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...