Friday, May 24, 2024

అమ్మ దుర్గమ్మQ

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
తేజస్విని
నీవు నవీన యశస్విని
చిలమత్తూరు పరమేశ్వరిని
సింధూర రాగ రాజరాజేశ్వరిని

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
అమ్మ శరణు
దుర్గమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!!
నిత్యం నా మస్తిష్కం
మదనం చెందుతూనే ఉంటుంది.
ఎడతెగని ఎన్నో ప్రశ్నలు
ఏకధాటిగా దాడి చేస్తూనే ఉన్నాయి.
ఆరని నిప్పుకణికల్లా
ఇంకా ఇంకా రగులుతూ
నాడుల్లోని నాడీకణాలు సైతం
చటుక్కున చిట్లిపోయేలా నా భావోద్వేగాలు...
జవాబులు దొరకని ప్రశ్నల సుడిగాలుల్లో తిరుగుతూన్నా
ఎందుకసలు నా మెదడులో ఇన్ని ప్రకంపనలు?
అందరిలా లేవెందుకు నా ఆలోచనలు?
ఏనాటికైనా నాలో ప్రశ్నార్థకాలై మిగిలిన వాటికి
కనీసం అర్థాలైనా దొరుకుతాయా?
ఆఖరికి ఇవి కూడా
నా మస్తిష్కపు పొరల్లో
ప్రశ్నలై కూర్చుండిపోతయా.
మహాదేవా శంభో శరణు

Thursday, May 23, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
నాతొ నీవుంటే క్షణాల్లా దొర్లిపోతుంది కాలం....
నీవు లేని ప్రతిక్షణం ఒక యుగం నాకు.....
ఆ యుగాలు క్షణాలుగా మారాలంటే...
నీ ఊహల ఊసులతో మైమరవాలి నా మది
నా తలపులన్ని నిండాలి నీ స్మృతులతో...

రాధే క్రిష్ణ....

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!!
కష్టం గా ఉందని నా దారి మార్చుకొను...

కష్టాలు ఉన్నాయని నిన్ను తలవడం మానేయను...

ఎన్ని కష్టాలు పెడుతావో పెట్టుకో..

శివ నీ దయ.

Wednesday, May 22, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
మహాదేవా నాకు ఈ పరీక్ష ఎన్నాళ్ళు ...
కఠినమైన మనుషులు మధ్యలో బంధించి...
నీ నామస్మరణ మించి వాళ్ళ నామం పలికేలా చేస్తున్నావు. ముగింపు పలికించు మహాదేవా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
సముద్రము ఎంత ఉన్న ...
సార్ధకము లేదు....
గంగ ఇంతే అయిన..
గళము తడుపు
మనిషి ఎంత ఉన్నమానవ హృదయము లేనిచో
మానవ జన్మ సార్ధకము ఏమి మనుజుడా.

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
ఆట నీకు వేడుకైనా
నేను ఆడలేనిక
శిక్షలు
పరీక్షలు 
చాలించి
కటాక్షించు 
నీ సేవకు నోచని ఈ దేహములో మినుకు మంటున్న
నా ప్రాణ జ్యోతిని నీ పాదాల వద్ద వెలగనీ నీ భవ్య తేజస్సుతో కలవనీ
నువ్విచ్చిన ఈ జన్మ నీకే సమర్పణం.

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...