Friday, May 24, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!!
నిత్యం నా మస్తిష్కం
మదనం చెందుతూనే ఉంటుంది.
ఎడతెగని ఎన్నో ప్రశ్నలు
ఏకధాటిగా దాడి చేస్తూనే ఉన్నాయి.
ఆరని నిప్పుకణికల్లా
ఇంకా ఇంకా రగులుతూ
నాడుల్లోని నాడీకణాలు సైతం
చటుక్కున చిట్లిపోయేలా నా భావోద్వేగాలు...
జవాబులు దొరకని ప్రశ్నల సుడిగాలుల్లో తిరుగుతూన్నా
ఎందుకసలు నా మెదడులో ఇన్ని ప్రకంపనలు?
అందరిలా లేవెందుకు నా ఆలోచనలు?
ఏనాటికైనా నాలో ప్రశ్నార్థకాలై మిగిలిన వాటికి
కనీసం అర్థాలైనా దొరుకుతాయా?
ఆఖరికి ఇవి కూడా
నా మస్తిష్కపు పొరల్లో
ప్రశ్నలై కూర్చుండిపోతయా.
మహాదేవా శంభో శరణు

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.