Tuesday, May 28, 2024

Monday, May 27, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము...
నువ్వు వచించే  మాటల్లోని అందమైన భావాలం మేము...
నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం మేము...
నువ్వు ఒకడివి ఉన్నావని తెలిసినా తెలియదన్నట్టు తిరిగే అజ్ఞానులం మేము...
మేమెలా ఉన్నా నువ్వు మాత్రం మము కాస్తూనే ఉంటావు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ నీ దయ

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మబ్బుల మాటునున్న పున్నమి చందురుని రూపం
కనపడి కనపడని నీటిలోని ప్రతిబింబపు వెలుగులలో
నడిరేయిలో, మలిఝాములో, సడిలేని ఏకాంతంలో
నీ తలపులు చుట్టుముట్టి నాతో సరాగాలాడుతుంటే
జాడ లేని నీ కోసం పైరగాలి పిల్లతెమ్మెర
సున్నితంగా తాకి వెళిపోతూ వుంటే
మదిలోని నీ రూపం కనుల ఎదుట
కనపడే క్షణం!! ఏదో చెప్పాలన్న ఆరాటంలో
ఏమి చెప్పలేక మూగబోయిన గొంతు సవ్వడి
మాటల్లేని మౌన నిశ్శబ్దంలో వినిపించే అంతే లేని
ఆశల ఊహల ఊసులు, కలల సౌధాలు....
నీకు చేరాయో లేదో!!

రాధే కృష్ణా

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నమ్మిన భక్తులను అభయం ఇచ్చే చేయి...
అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన బోళాశంకరుడి బంగారుచేయి....
అభయం ఇస్తూ... 
ఆదుకుంటూ.... 
అనుగ్రహిస్తూ... 

శివ నీ దయ.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

విశ్వాసమున్న చోట ప్రేమ...
ప్రేమ గలచోట శాంతి...
శాంతి వున్న చోట సత్యము...
సత్యముగల చోట ఆనందమూ...
ఆనందం ఉన్న చోటనే భగవంతుడు వుంటాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం పరమాత్మనే నమః

Sunday, May 26, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


జీవితంఅంతులేనిదీ
జీవితం అంతుతేల్చలేనిది
ఉదయ సంధ్య ఎడారులలో
సాగిపోతుంటది.
ఎండమావి ఆశల వెంట
పరుగుబెట్టిస్తది
నల్లేరు ఎడారులలో
తింపుతూనె ఉంటది
అంతులేని ఆశల దిబ్బల
సంబరాల పంచేస్తూ
ఊహించని సుఖ జీవనంలో
ఆడిస్తూనే
విషాదా పాతాళాన పడవేసీ
మోహాల అంతులుజూపి
జీవన నాటక అంతరంగ తెరలలో
నీనటనే చూపించి విస్మయాల
గురిచేస్తది.
ఈమోహబంధాలకు
పొంగిపోక క్రుంగకు
అంతులేని ఆశల వెంట
అలసొలసి పడబోకు.
ఎండమావులేయవి
ఎదలనాడించేవి
జీవిత పరమార్థం తెలుసుకో
పవిత్రమై సాగిపో.
ఉన్ననాళ్ళు జీవితంలో
పొంగిపోకు
లేమిగల జీవితంలో
క్రుంగక కృశించిపోకు
ఇదే ఇదే జీవితం
తెల్లకాగితం వంటిదే
అంతరంగ పరమాత్మనుకలుసుకో
అదే బోధచేయులే.

ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...