Thursday, June 13, 2024

శివోహం

నీలా ఉండాలంటే హాలహలం(దుఃఖం) ఇంకెంత తాగాలో నేను..

అమరమై నీలో మిగిలిపోవాలంటే..

శివ నీ దయ.

గణేశా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
గణేశా...
నీ దివ్య దర్శనము మాకు కలిగించు...
పార్వతి సుతుడా పరమేశ్వర పుత్రుడా...
సిద్ధి బుద్ధి గణపయ్య కరుణ చూపు మాపై...
నీ దీవెనలు అందించు లంబోదర
నీవే దిక్కని మొక్కే మాకు
దయతోడ మమ్ము కాపాడుమయ్య
గణపయ్య నీవే శరణు

ఓం గం గణపతియే నమః.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీ కిరణం నన్ను తాకింది...
ఒక వెలుగై నన్ను నాకు చూపింది...
నీ ఓంకారం నా చెవిన మారుమోగుతుంది.
మహాదేవా శంభో శరణు.

Wednesday, June 12, 2024

శివోహం

ఓం నమో భగవతే వాసుదేవాయ

మార్పు కలిగేదే జీవితం.. నేడు మానవుడు ప్రతిదీ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు..  ఉండడానికి ఇరుకుగా ఉందని ఇల్లు మారుస్తున్నాడు, నడపడానికి సౌకర్యంగా లేదని కారుని మారుస్తున్నాడు, పొగడ్తలు లేవని మనుష్యుల్ని మారుస్తున్నాడు, లాభం రావడం లేదని వ్యాపారం మారుస్తున్నాడు, చివరిగా కష్టాలు తొలగడం లేదని దేవుల్ని సహితం మార్చేస్తున్నాడు కానీ ... తనను తాను మాత్రం మార్చుకోవడం లేదు!! నీకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య నీది తప్ప అవతలది కాదు!! కనుక ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి.. మంచి భావాలను కలిగి ఉండాలి.. చెడు భావాలు, చెడు అలవాట్లను వదలాలి.. దేవునిపై అపనమ్మకం వదిలి విశ్వాసవంతునిగా మారాలి. అపుడు ప్రతిదీ నీకు అనుకూలంగానే మార్పు చెందుతుంది.

హరే కృష్ణా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
కృష్ణ అన్న పదం ఒక పేరు కాదు...
ఒక భావం...
ఒక విశ్వ గానం...
సకల సృష్టికి మూలం...
అనంత రూపాలు నామాలు గలిగిన దేవదేవునికి .  హరే కృష్ణా అంటూ నిత్యం స్మరిస్తూ తరించడం వల్ల మనసుకు ఎంతో ఆనందం ,ప్రశాంతత ఉంటుంది...

హరే క్రిష్ణ హరే రామ్.
ఓం క్రిష్ణ పరమాత్మనే నమః

శివోహం

శివా!సమాప్త మెరుగని కథలు సశేషమై
కూడుతున్నాయి కుప్పలు తెప్పలుగా
కథలు ముగియనీ కంచికి చేరనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ప్రతీ తాళానికీ నీవు మాత్రమే తీయగల చెవి తయారు చేయగలవు...
నా బతుకు తాళం చెవి నీ చేతిలో ఉంది...
నా తండ్రి పరమేశ్వరా నన్ను లోపలపెట్టి తాళం వేస్తావో...! బయటకు తోసేస్తావో నీ దయ తండ్రి.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...