Wednesday, June 19, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది...

సంధికాలంలో  నవవసంతం
పుడమి దాటి పరవళ్లు  తొక్కుతోంది.

ఇచ్చేది నీవు మెచ్చేది నీవు...

ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత
అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర.

మహాదేవా శంభో శరణు.

Tuesday, June 18, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాకుండే ఒకే నేస్తం నీవు
హృదయంలో నెలకొన్న నీ రూపం
నీ నామమే పరవశంలో ఏ పేరు తలిచినా పొంగే హృదయం
నీ నామ మాధుర్యంలో నిత్యం ఏకాంతమే
కొంచెం నాకూ చోటివ్వు
నీ హృదయం లో సర్దుకు పోతాను.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాకుండే ఒకే నేస్తం నీవు
హృదయంలో నెలకొన్న నీ రూపం
నీ నామమే పరవశంలో ఏ పేరు తలిచినా పొంగే హృదయం
నీ నామ మాధుర్యంలో నిత్యం ఏకాంతమే
కొంచెం నాకూ చోటివ్వు
నీ హృదయం లో సర్దుకు పోతాను.
మహాదేవా శంభో శరణు.

Monday, June 17, 2024

శివోహం

శివోహం

శివా!మౌనం చేయడం లేదు
మౌనంగా వుంటున్నాను 
మన్నించి మనుపుమయ్యా..
మహశా . . . . . శరణు .

Sunday, June 16, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
గుండె  నిండుగా  చేసుకొని
గుండంలొ నిండా మునిగి గురి నీ మీద పెట్టుకొని
గుడి గంట ఠామ్మని కొట్టి నిలిస్తిని నీ ముంగిట
చెంబెడు నీళ్ళు కుమ్మరిస్తి
నీ లింగ మీద పత్రి పెడితిని
నా వంక దయతో చూడమని
సాగిలబడి నీకు మొక్కుకుంటిని.
మహాదేవా శంభో శరణు.

Friday, June 14, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
మణికంఠ....
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ  రూప దివ్యగానం చేస్తూ...
పాల పొంగులా   పొరలే అనందాన్ని నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది...
నీ దివ్య నామాన్ని నోరారా  స్తుతిస్తూ  ,తన్మయం పొందే పరమ సౌఖ్యాన్ని ఈ నా నాలుకకు  అందించవా...

హరహర పుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...