Friday, June 21, 2024

గోవిందా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరి!
సకల ప్రాకోటికి మోక్ష మార్గంచూపు జ్ఞాన దీపం నీవు...
మానవులలో వుండే అంధకారమును తొలగించే జ్యోతి నీవు...
నీ నామ జపం తో మా మనస్సుకు ప్రశాంతత కల్పించే  దివ్య మంగళస్వరూపుడవు.
నీవే శరణు నీకె శరణు.

ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ.


             

శివోహం

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
హలమును దాచి...
గళమును విప్పి  వచ్చావు
రుద్రనాయకుడి వై
భధ్రమూర్తి లా నడిపిస్తావు
కాలహరుడి వై
సృష్టి చక్రము ను శాసిస్తావు
మోక్షనాధుడి వై
ఆత్మఘోషలకు కరుణిస్తావు
భస్మరూపుడు వై
విశ్వము నే పరిపాలిస్తావు
నీకు సాటి ఎవరు లేరాయా హర...
నీకు నీవే సాటి..
మహాదేవా శంభో శరణు

Wednesday, June 19, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

భోగభాగ్యాలు ఇచ్చు భువనైక మాతా...
భవబంధాలను  తొలగించు భాగ్య చక్ర  స్వరూపిణి...
పాయసాన్న ప్రీతీ శ్రీకంఠార్ధ శరీరిణీ పంచ సంఖ్యోపచారిని..
ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి స్వరూపిణి...
ఇష్ట కార్యములు తీర్చు అష్ట దరిద్రాలు తొలగించు
కష్ట సుఖములందున  కొలిచిన వారికి అష్ట ఐశ్వర్యములు ఇచ్చు పసిడి అలంకృత పాపనాశిని పాహిమాం దుర్గేశ్వరి.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
అమ్మ నీవే శరణు.

శివోహం

శివా!కంటబడక నీవు కాపు కాసేవు
వెంటబడినా గాని కంటబడవు
మర్మాన మసలేవు మర్మమేమిటో
మహేశా . . . . . శరణు .

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది...

సంధికాలంలో  నవవసంతం
పుడమి దాటి పరవళ్లు  తొక్కుతోంది.

ఇచ్చేది నీవు మెచ్చేది నీవు...

ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత
అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర.

మహాదేవా శంభో శరణు.

Tuesday, June 18, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాకుండే ఒకే నేస్తం నీవు
హృదయంలో నెలకొన్న నీ రూపం
నీ నామమే పరవశంలో ఏ పేరు తలిచినా పొంగే హృదయం
నీ నామ మాధుర్యంలో నిత్యం ఏకాంతమే
కొంచెం నాకూ చోటివ్వు
నీ హృదయం లో సర్దుకు పోతాను.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...