Saturday, June 22, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరిహారపుత్ర అయ్యప్ప...
నాకు నీ మంత్రము తెలియదు నీ యంత్రమూ తెలియదు...
నిన్ను స్తుతించడమూ తెలియదు, నిన్ను ఆవాహన చేయడమూ తెలియదు, నిన్ను ధ్యానించడమూ తెలియదు, నీ గాధలు చెప్పడమూ తెలియదు...
నీ ముద్రలూ తెలియవు...
ఇవేవి తెలియవని నీకోసం విలపించడమూ కూడా చేత కాదు....
కానీ నీవే నా నమ్మకం నిన్ను విధేయతతో స్మరిస్తే నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు.

అయ్యప్ప శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భగవంతుని నామ జపం ఎంతటి చెడునుండైనా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలాగే, భగవంతుని నామస్మరణ చేత అన్ని బాధలు దగ్ధం కాగలవు. మడి, ఆచారము అవసరము కాదు. క్రమం తప్పకుండా జపించడం ముఖ్యం. హనుమంతుని శక్తి రహస్యం నిరంతర రామనామ జపమే.

ఓం శివోహం... సర్వం శివమయం
ఓం పరమాత్మనే నమః

Friday, June 21, 2024

గోవిందా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరి!
సకల ప్రాకోటికి మోక్ష మార్గంచూపు జ్ఞాన దీపం నీవు...
మానవులలో వుండే అంధకారమును తొలగించే జ్యోతి నీవు...
నీ నామ జపం తో మా మనస్సుకు ప్రశాంతత కల్పించే  దివ్య మంగళస్వరూపుడవు.
నీవే శరణు నీకె శరణు.

ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ.


             

శివోహం

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
హలమును దాచి...
గళమును విప్పి  వచ్చావు
రుద్రనాయకుడి వై
భధ్రమూర్తి లా నడిపిస్తావు
కాలహరుడి వై
సృష్టి చక్రము ను శాసిస్తావు
మోక్షనాధుడి వై
ఆత్మఘోషలకు కరుణిస్తావు
భస్మరూపుడు వై
విశ్వము నే పరిపాలిస్తావు
నీకు సాటి ఎవరు లేరాయా హర...
నీకు నీవే సాటి..
మహాదేవా శంభో శరణు

Wednesday, June 19, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

భోగభాగ్యాలు ఇచ్చు భువనైక మాతా...
భవబంధాలను  తొలగించు భాగ్య చక్ర  స్వరూపిణి...
పాయసాన్న ప్రీతీ శ్రీకంఠార్ధ శరీరిణీ పంచ సంఖ్యోపచారిని..
ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి స్వరూపిణి...
ఇష్ట కార్యములు తీర్చు అష్ట దరిద్రాలు తొలగించు
కష్ట సుఖములందున  కొలిచిన వారికి అష్ట ఐశ్వర్యములు ఇచ్చు పసిడి అలంకృత పాపనాశిని పాహిమాం దుర్గేశ్వరి.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
అమ్మ నీవే శరణు.

శివోహం

శివా!కంటబడక నీవు కాపు కాసేవు
వెంటబడినా గాని కంటబడవు
మర్మాన మసలేవు మర్మమేమిటో
మహేశా . . . . . శరణు .

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...