Wednesday, June 26, 2024

హరే శ్రీనివాస

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరి శ్రీహరి!
సర్వత్రా వెలుగును ప్రసరించే నీకు...
వెలుగులోకి వెలుగేలా ఈ హారతులేల...
ఒక్క క్షణం దర్శనం చేతనే ఏడు జన్మల మా పాపములు హరింతువు..
పాప హరుడికి కోనేటి స్నానాలేల ఈ అభిషేకాలేల...
ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి  తెప్ప తిరుణాళ్ళేల, బ్రహ్మోత్సవాల్లేల...
మా ఆజ్ఞానాన్ని తొలగించాడానికే కదా ఈ హారతులు!
మములను ప్రక్షాళన గావించడానికే కదా ఈ స్నానాలు...
మము ప్రఖ్యాతి గాంచడానికే కదాఈ ఉత్సవాలు.

గోవిందా శరణు.
ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అమృతమే నీవు...
అద్భుతమే నీవు...
ఆనందమే నీవు...
ఆద్యంతమే నీవు...
అద్వైత్వమే నీవు....
శివ శిరమేదైనా నీకు శిరసు వంచి నమస్కరించే తీరున నీ చేరువలో ఉంచుకో తండ్రి.
మహాదేవా శంభో శరణు.

Tuesday, June 25, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భక్తే ప్రేమ...
ప్రేమే భక్తి...
ప్రేమే ఆరాధన...
ప్రేమే దైవం...
ప్రేమే పరమాత్ముని స్వరూపం...
ప్రేమే ఈశ్వరీయగుణం...
ప్రతి ఒక్కరి అంతఃచేతనల్లో వున్న అంతరాత్మే ప్రేమస్వరూపుడైన దైవం...
నా అనేవారికే పరిమితం చేయకుండా అందరిలోవున్న ఆత్మే ప్రేమస్వరూపుడైన భగవంతుడని గ్రహించి, దయార్ధమైన ఆలోచనలూ, మాటలు, చేతలతో అందరితో ప్రేమగా ఉంటే పరమాత్మను పొందగలం...
భగవంతుని ప్రేమను పొందాలంటే మనలో ప్రేమతత్వమును పరిపూర్ణంగా పెపొందించుకోవాలి. సర్వదా, సర్వత్రా ప్రేమతో, సంయమనంతో, సహనంతో వుండాలి...
అంతటా ఈశ్వరున్నే చూడగలిగే స్థితిలో వుండగలగాలి...
మనం పరిపూర్ణమానవులుగా ఎదగాలంటే మనస్సుకు ఏ స్థితిలోనైనను ప్రేమ, దయ, ప్రశాంతత, సృజనాత్మకతతో వుండగలగడం నేర్పించాలి...
అదే నిజమైన భక్తి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
కరుణ గల దేవుడవు...
స్మరణ సులభుడవు...
స్ఫురణకు సోహంలో ఉన్నావు...
నీ చరణాలే నాకు దిక్కు మొక్కు...

మహాదేవా శంభో శరణు.

Monday, June 24, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ...
నీ నామం మాకు శ్రీరామ రక్ష...
నీ భావం మాకు ఎనలేని సంపద...
నీ శ్రీశైల క్షేత్రం మాకు ఆనంద నిలయం...
నీవు లేకుండా మేము లేము...
నీ తలంపే మా బ్రతుకులకు మనుగడ...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ నీ దయ
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీవు నాకు ఉత్తమ జన్మను ఇచ్చావు
నీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను...
అందుకే నా మనసును నీకు అంకితం చేస్తున్నాను నీ దగ్గరే ఉంచేసుకో.

మహాదేవా శంభో శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...