Thursday, July 11, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఇచ్చినను నీవే మా దుర్గమ్మవి !
ఇవ్వకనూ నీవే మా పెద్దమ్మవు !!

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
త్రినేత్రా త్రిలింగ దేవా...
త్రిశూల పాణీ పరమేశ్వరా...
పాపపరిహార పార్వతీపతి...
నా గుండెను వేదన చూడు...
గుండెలో గూడు కట్టుకున్న నన్ను చూడు....
వేదనలే నివేదనలు గా అర్పిస్తున్న నా భావాలు చూడు...
నిన్ను తలుచుకున్న ప్రత్రి సారి కన్నుల నుండి కారే కన్నీరు చుడు.
నీతో మాట్లాడాలని
నీతో ఉండాలని నే వచ్చా...
మౌనము దాల్చావు
మాటాడను అంటావు వేమి
మౌనంవీడి మాటాడు ఈశా
నీ మనసులోని భావాలు నాకెలా తెలుసు.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మనం నమ్మిన దైవమే మనకు రక్ష
కష్ట కాలంలోనైనా మహాదుఖం లో నైనా
బంధువులు , ఆప్తులు స్నేహితులు తోబుట్టువులు కూడా రాలేని చోట ఒక్క ఈశ్వరుడే మనకు అండ దండ..
మనల్ని సర్వకాల సర్వావస్థలయందు కాపాడగలిగేది
మహాదేవుడు ఒక్కడే
శివ నీవు తప్ప ఎవరు మాకు రక్ష అనే ఒకే ఒక మాట మనకు శ్రీరామ రక్ష.

శివ నీ దయ.
ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, July 10, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీవు మాకిచ్చిన ఆకలి అవసరాలు నిన్ను మరిచేలా
చేస్తున్నాయి...
ఆ పోరాటంలో నీ ధ్యాస తగ్గుతున్న మాట నిజమే...
నీవేమో ఆకలితో అలమటించే మమ్మల్ని చూడలేక
ఆహారం, నీరు, అగ్ని, గాలి రూపాలలో ఆకాశమంత అండగా కాపాడుతున్నావు...
కడుపునిండాక నిన్ను మరచి నిదరోయినా సోహం ఊయలూపి నిదురిస్తున్నావు...
నీ ఋణం ఎలా తీర్చేది తండ్రి..
రాతిరి నిదుర ఊపిరి నీకే అంకితం.


మహాదేవా శంభో శరణు.

Tuesday, July 9, 2024

శివోహం

శివ నీ దయ
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివోహం

శివా!జన్మలెన్నొ ముగిసేను జన్మ తెలియకుండా
మరణమేమో వచ్చేను గుర్తు తెలియకుండా
ఎన్నాళ్ళీ ఆట గెలుపు వోటమి లేకుండా
మహేశా . . . . . శరణు .

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ,
మట్టితో బొమ్మను చేసి..
మనిషిగా ప్రాణం పోసి..
బంధానికి బందీ చేసి..
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి..
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా  శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా..
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా.

మహాదేవా శంభో శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...