Sunday, August 25, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నిన్ను కొలుచుటకు ఇసుమంత యోగ్యత లేని దీనుడిని నీవే దిక్కు...
వేరే గతి లేదు నాకు...
శరణు అంటూ నీ పాదాలు గట్టిగా పట్టుకొని వేసుకోవడం తప్ప మరే మంత్రము, జపము, స్తోత్రము ,యాగము చేసే యోగం లేని అధముడను తండ్రీ...
దయఉంచి నన్ను కరుణించు...
నిన్ను మనసారా తలచుకొంటూ  ఆరాధించే దృఢమైన ఆత్మశక్తినీ,చెదరని స్పూర్తిని,ఆచంచమైన భక్తినీ, ప్రగాఢవిశ్వాసాన్ని  అనుగ్రహించు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అనంత నామాలు కలిగి ఉన్న నీవే మాకు కొండంత అండ.

హరి శ్రీ హరి శరణు.

Saturday, August 24, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మనిషి కష్టాలకు మూలకారణం ఏమిటి?
మనస్సు శుద్ధంగా లేక పోవడం
మనస్సు ఎందుకు శుద్ధంగా లేదు?
పాపాలు చేయడం వల్ల
పాపాలు ఎందుకు చేస్తున్నాడు?
కామ క్రోధాల తాకిడి వల్ల
కామ క్రోధాలు ఎక్కడివి?
రజోగుణం నుండి పుట్టినవి
రజోగుణం ఎక్కడిది?
అహంకారం నుండి పుట్టింది
అహంకారం ఎట్లా పోతుంది?
దేవుడికివ్వు.

ఓం నమః శివాయ.

శివోహం

ఎన్నెన్ని జన్మల బంధమో ఇది.
ఈ జన్మలోనూ వెతుక్కుంటూ నీ చెంతకు చేరా.

శివ నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
సత్యము నందలి శక్తివి నీవు...
నిత్యము నను సన్మార్గమున నడిపించు వాడవు నీవే...
బుద్ధిని నీపై జోడిస్తే జ్ఞానము ను చెపుతావు  శ్రేష్టంగా చేస్తావని తెలుసు...
పాపం చేత కళంకితమైన ఈ లోకంలో....
పుణ్యాన్ని పండించగల కరుణాసముద్రుడవు నీవునని తెలుసు..
అంతులేని స్వార్థం...
అవధుల్లేని అహంతో...
నీ ముందు మోకారిల్లుతున్న...
జ్ఞానభిక్షను ప్రసాదించు నాన్న...

మహాదేవా శరణు శరణు.

Thursday, August 22, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఏమని చెప్పేది...
నీ మహిమను ఎలాగ చెప్పేది...
హర హర అంటే జీవశక్తి అన్ని
ముల్లోకాలన్నీ మారుమ్రోగుతుంది...
శివ శివ అంటే నీ ఆశీస్సుల తో అష్టదిక్పాలకులు నాట్యం చేస్తుంటే...
ఏమని చెప్పేది నీ మహిమను ఎలాగ చెప్పేది...
హర హర అంటే పాప హరణమని
నవ నాడులు సైతం ఘోషిస్తుంటే.
శివ శివ అంటే ముక్తి భాగ్యమని 
నవ గ్రహములు నిత్యం ఆలపిస్తుంటే.
ఏమని చెప్పేది నీ మహిమను ఎలాగ చెప్పేది.

శివ నీ దయ.

Wednesday, August 21, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
పుట్టినప్పుడంతా నవ్వారు...
జీవితమంతా ఎడిపిస్తూనే...
నవ్వించినట్లు నటిస్తున్నారు.

శివ నీ దయ.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...