Friday, August 30, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను ఎవరి తల అయినా ఎంత కాలం మోస్తుంది...
దూరాలు దుర్భరాలు కాకుండా ఉండాలి అంటే భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు..
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్కడున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని ఎలుగెత్తి పిలుద్దాము...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పరబ్రహ్మస్వరూపిణి...
నారాయణి....
శివాని...
సర్వదేవతా స్వరూపిణి  అనంతకోటి జీవరాశులలో తేజోమయిగా విలసిల్లే మూలప్రకృతి.
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః

Thursday, August 29, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
కలియుగం కలుషాలకు నిలయం, దినదినం నా ఆలోచనల లయలు మారుతూ...

అలలు కడలి తీరంపైనే
నిలబడి పోతున్నాయి...
మాయ నీ లయలో చేరేవరకు నేను
చాలా లోయల వనాల తిరగాలి కదా అందుకే చలనము లేని మదిని అందించు.

మహాదేవా శంభో శరణు.

Wednesday, August 28, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
మీకే కాదు...
కలియుగంలో ఆడించేటి మనుషుల కు ఆటబొమ్మను నేను...
అవసరాల మనుషులకు కీలుబొమ్మను...
ఈ బొమ్మ కు ప్రాణం ఎందుకు పోశావో...
మనసును ఎందుకు మైనం చేశావో కానీ.
చిద్రమైన మనసుకు ఆసరా నీవే హర.

మహాదేవా శంభో శరణు.

Monday, August 26, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఎదురుచూస్తున్నా ఆ గంధపుసువాసనకు..

ఆకస్మిక వసంతవాయువు ఏ వైపు నుండి వీస్తుందోనని.

శివ నీ దయ.

శివోహం

శివ!
నా మనోవేదనకు మందు నీ నామ స్మరణ.

శివ నీ దయ.

Sunday, August 25, 2024

శివోహం

శివ!
నా మనోవేదనకు మందు నీ నామ స్మరణ.

శివ నీ దయ.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...