Tuesday, September 3, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు..
ఉన్న కొన్ని (సం)బంధాలలో జీవం వుంటే చాలు...
జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే...

శివోహం

శివ!
కన్నీరు కారడానికి కారణం ఏంటో తెలియదు కానీ ...
కస్సుకని ఉబికి వస్తున్న బొట్టు బొట్టులో నీ రూపమే తండ్రి.

శివ నీ దయ.

Sunday, September 1, 2024

శివోహం

శివా!తృప్తి అన్నిటా నాకు తెలియవచ్చే
కానీ కాస్తంత వెలితి ఎదో కానవచ్చె
ఎరిగించి తొలగించు ఆ వెలితిని
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీ కనుసన్నలలో నేను...
మిగతావి అనవసరం...
శివ నీ నామ స్మృతితోనే సర్వ   దుఃఖ హరణం.

శివ నీ దయ.

Saturday, August 31, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కాలమునే కదిలించేటోడికి
గొంతులో గరళం
మనసేమో అమృతం...
మృత్యువునే శాసించేటోడికి
రూపంలో రౌద్రం
దేహమేమో ధ్యానం.
శివుడే నిజం...
శివమే జీవం...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
పుష్పక విమానం లాంటి నా హృదయం 
నీ కైలాసం కన్నా పెద్దది...
నీ పరివారం అందరూ
వచ్చినా సరిపోతుంది
నీవిచ్చిన సంపదే కదా
మొహమాటం దేనికి
ఓసారి వచ్చి వెళ్ళరాదా
శివ నీ దయ 
మహాదేవా శంభో శరణు

Friday, August 30, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను ఎవరి తల అయినా ఎంత కాలం మోస్తుంది...
దూరాలు దుర్భరాలు కాకుండా ఉండాలి అంటే భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు..
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్కడున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని ఎలుగెత్తి పిలుద్దాము...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...