Tuesday, September 24, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
గుండెలోన పొంగుతోంది హాలాహలం...
దాన్ని నీ లాగా మింగలేక
బాధను దిగమింగలేక
ఏమిచేయ పాలుపోక
మునుపటిలా ఉండలేక
మనసంతా మలినమై
ఉచ్చ్వాసే అనలమై
మిగిలినాను జడుడిలా
మహాదుఃఖ కడలిలా...
మహాదేవా శంభో శరణు.

Monday, September 23, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ! 
పెరిగే వయసులో పెరుగుతున్న బాధ్యతలు భయపెడుతున్న వేళ మనసుతో మాట్లాడుతూ ధైర్యం చెప్పి నా బతుకు బండిని నడిపిస్తున్నాను,...
పడుతూ లేస్తూ మధ్య మధ్యలో అలసిపోయినా
విసుగు చెందక, విరామం పొందక నా గుండెను నీవే నడిపిస్తున్నావు...
ఒడి వడలినది
ఓపిక సడలినది
చూపు మందగించింది
ఇక చాలు జీవితపు గూటిలో గూడు కట్టుకున్న గుండె నిదురపుచ్చలి నీవే.

మహాదేవా శంభో శరణు.

Sunday, September 22, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఈ బంధాలు అన్ని బుణము లే  ఏనాటికీ అవి అనుబంధములు   కాబోవు..
ఎవరి ఆకలి వారిదే
ఎవరి లెక్కలు వారివే
ఎవరి జీవితం వారిదే
ఎవరి జీవనం వారిదే.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అదే ఊపిరి...
అదే పంచాక్షరీ...
ఊరు ఏదైనా నాకున్నది నీవే...
శివుడు లేని ఊరు చొరబడకు అని సామెత...
కానీ నీకు నాకు తప్పదు.

మహాదేవా శంభో శరణు.

Friday, September 20, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఆనందం ఎలాంటిదో కాదు..
ఎంతటి వారితో ఆ సంతోషం పంచుకుంటున్నామో అనేదే..

ఆ ఆనందం ఆ సర్వేశుని చెంతనే 
అన్నది ఎంతో గొప్ప వరం...

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, September 19, 2024

శివోహం

తండ్రీ కొడుకుల అనుబంధం
ఒక జన్మది కాదు.
ఒక జన్మతో తీరిపోదు.
అది జన్మజన్మల అనుబంధం.
జన్మజన్మలకూ సరిపోని బంధమే మనది..
అందమైన అబద్దం లో జీవించే నాటకానికి తెరలేపి శాశ్వతమైన ఆనందం నీ పాదాల దగ్గర రప్పించు.

మహాదేవా శంభో శరణు.

Wednesday, September 18, 2024

శివోహం

శివ! 
నడక నాకేమి ఎరుక మరి తండ్రి...
నీ విక్కడే ఎక్కడో  నా వెనుక ఉండి నడిపిస్తున్నావు నన్ను.
నీ సుగంధ సువాసన పరిమళాలు నా మనసును తాకుతుంది.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...