Thursday, October 10, 2024

శివోహం.

 భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు

చిత్తములో వెతకండి...
భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు...
కానీ మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన మనకి కానరాడు...
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు...
మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు...
మొదటిది అహంకారం, రెండవది మమకారం...
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు....
జై శ్రీమన్నారాయణ
ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, October 2, 2024

అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప

నా నడకలో నీ నామమొకటే తోడుగా ఉండేది.

నిన్ను చేరే దారిలో భయమేమి కలగకుండా నీవే ధైర్యం కల్గించాలి

మణికంఠ శరణు.

Tuesday, October 1, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఉరుకుల పరుగుల జీవితం...
ఆగితే దొక్కడదు...
ప్రాపంచిక బంధాల మాయలో పడి నిన్ను మరిచాను....
క్షణిక సుఖమే శాశ్వతమని తలచి నిన్ను మరిచాను.  
అనుభవాలు ఎన్ని ఎదురైనా....
ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి....
వ్యామోహములో పడి చింతిస్తున్న....
తెలిసి తెలియక నిన్ను మరచిన
కాలాన్ని తొలగించు..
నిన్ను తలచిన క్షణాలనే గుర్తించి
ఆదరించు.

శివ నీ దయ.

Monday, September 30, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అంతా శివమయం అనీ తెలుసూ
అదీ శివమాయే అనీ తెలుసూ
మేమంతా శివమాయా సమ్మోహితులమే అనీ తెలుసూ
సదా నాలో నీవే ఉన్నావనీ తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ
ఏదో ఒక నాటి కి
అంతా నీ లో లయమనీ తెలుసూ
అదీ సదాశివ మాయే అనీ తెలుసూ
నీవే ముక్తినాధుడవనీ తెలుసూ
నీవే మోక్షప్రదాతవనీ తెలుసూ
నీవే లయకారకుడవనీ తెలుసూ
తెలసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ
అదీ నాలో నీకూ నాకే తెలుసూ.

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, September 29, 2024

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఆదిశక్తివి నీవు...
అన్నపూర్ణవి నీవు… 
సర్వ లోకాలు ఏలు ఆదిపరాశక్తివి నువ్వు....
మా భాదలను తీర్చే బెజవాడ కనకదుర్గమ్మ....
మా కోర్కెలు నెరవేర్చు కల్పవల్లి....
మా పాడి పంటలను కాపాడు కరుణమయి...
సర్వం నీవై ఉన్న...
సర్వరూప కారిణి...
జగత్ జనని..
తేజో రూపిణి...
విశ్వమంతా నిండివున్న శివశక్తివి.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీకు నాకు నిత్యం అభిషేకమే
నీకు నీ గంగజలం తో...
నాకు నా కన్నీటితో...
అవేదన ఎంత అవరించిన నీ ఆరాధన విడనాను...
ఎందుకంటే నా భవిషత్తు యొక్క బలం నీవే తండ్రి.

ఓం నమః శివాయ

Friday, September 27, 2024

శివోహం

శివా!
అద్దె ఇల్లు నాకు ఇరుకు గా ఉంది...
బాధలు బందలతో గుండె గదుల్లో చోటే లేదు...
ఐనా నీ ఇల్లు  విడిచి...
ఈ ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావేమయ్యా...
ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావు..
మా బోటి  వారితో  ఈ బంధం  ఏలనయ్యా హర.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...